తెలంగాణ

గురుభక్తిని చాటుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 16: ఎంతా ఉన్నా... ఏ స్థాయికి ఎదిగినా కన్న తల్లిదండ్రులు, ఉన్న ఊరును, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను విస్మరించరాదంటారు. రాష్టస్థ్ధ్రాయిలో ఉన్నతమైన హోదాలో ఉండి నిత్యం తీరిక లేకుండా గడిపే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గురుపౌర్ణమి పర్వదినాన సుమారు 35 ఏళ్ల క్రితం తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు ఇంటికెళ్లి గురువందనం చేసి గురుస్థానం ఎంత విశిష్టమైనదో చాటిచెప్పారు. ఆధునికత మోజులో నేటితరంలో అంతరిస్తున్న గురుభక్తికి జీవం పోసేలా భారతీయ సంస్కృతిని పాటించి స్ఫూర్తిగా నిలిచారు. మంగళవారం జిల్లాకేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి జగదీశ్‌రెడ్డి తొలుత గురుపౌర్ణమిని పురస్కరించుకొని స్థానిక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దైవ పూజల అనంతరం గురుపౌర్ణమి విశిష్టతను గుర్తుచేసుకొని తన గురువుల్లో ఎవరినైనా పూజించాలని సంకల్పించుకున్నారు. అనుకున్నదే తడవుగా 1982 నుండి 1985 వరకు జిల్లాకేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో తనకు ఆంగ్లం బోధించిన పోటు సుబ్బయ్య మాస్టర్‌ను గుర్తుచేసుకొని పారిశ్రామికవాడలో నివాసముండే మాస్టర్ ఇంటికి నేరుగా వెళ్లారు. తన ఉన్నతికి బాటలు వేసిన గురువుకు రెండుచేతులు జోడించి నమస్కరించి పాదాభివందనం చేశారు. శాలువాతో సత్కరించి పదివేల నగదును దక్షిణగా అందించారు. 85 ఏళ్ల వృద్ధాప్యంలో ఉన్న తన వద్దకు రాష్టమ్రంత్రి స్థాయిలో ఉన్న తన శిష్యుడు గుర్తుచేసుకొని వచ్చి అరుదైన గౌరవం చూపి సత్కరించడంతో మాస్టర్ కళ్లలో ఆనందభాష్పాలు కన్పించాయి.
సూర్యాపేటను ఆదర్శంగా అభివృద్ధి చేస్తా
తనను ఆదరించి అక్కున చేర్చుకున్న సూర్యాపేటను అన్నిరంగాల్లో అభివృద్ధిచేసి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి రూ.75 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ నేడు సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అన్నిరంగాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. విద్యుత్ పంపిణీతో పాటు రైతులు, అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం ఇక్కడ అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని తమ రాష్ట్రాల్లో ప్రారంభిస్తుండటం తెలంగాణకు దక్కుతున్న సముచిత గౌరవానికి ప్రతీకన్నారు. తెలంగాణ ఏర్పాటు కావడం వల్లే సూర్యాపేట జిల్లాగా ఆవిర్భవించి అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. సూర్యాపేట ప్రజలు ఎవరూ ఊహించని రీతిలో మెడికల్ కళాశాలను సాధించామని, ఈ కళాశాల ఏర్పాటువల్ల ప్రజలకు అత్యుత్తమమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతోపాటు ఉన్నతమైన వైద్య విద్య చదువుకునే అవకాశం దక్కుతుందన్నారు. సూర్యాపేటను అన్నిరంగాల్లో అభివృద్ధిచేసి అభివృద్ధికి దిక్సూచిగా నిలిపేదిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే రూ.75 కోట్ల ప్రత్యేక నిధులను మంజూరు చేయించి మున్సిపాల్టీ పరిధిలోని అన్ని వార్డుల్లో సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటి హాళ్లు, పార్కుల నిర్మాణం చేపట్టడంతోపాటు పట్టణంలోని ప్రధాన రహదారులన్నింటినీ విస్తరించనున్నట్టు చెప్పారు. త్వరలోనే జిల్లాకేంద్రంలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ప్రభుత్వం రూపొందిస్తున్న నూతన మున్సిపల్ చట్టం ద్వారా పట్టణ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట నుండి ప్రాతినిధ్యం వహించడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. మంత్రి సారథ్యంలో జిల్లా ఏర్పాటు జరగడంతో పాటు రూ.100 కోట్ల నిధులతో అభివృద్ధి జరిగిందన్నారు. నిరంతరం ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న టీఆర్‌ఎస్‌ను త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళిక, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, నాయకులు వై.వెంకటేశ్వర్లు, గండూరి ప్రకాష్, పెద్దిరెడ్డి రాజా, జుట్టుకొండ సత్యనారాయణ, భాష, బైరు వెంకన్న, బైరు దుర్గయ్య, మాజీ కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
చిత్రం...తన గురువు సుబ్బయ్య మాస్టర్‌కు పాదాభివందనం చేస్తున్న
విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి