తెలంగాణ

24 నుంచి ఆర్కిటెక్చర్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: నాటా జెఈఈ మెయిన్ పేపర్‌లో అర్హులైన వారితో ఆర్కిటెక్చర్ కాలేజీల్లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ను ఈ నెల 23న విడుదల చేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి చెప్పారు. 24వ తేదీ నుండి 31వ తేదీ వరకూ రిజిస్ట్రేషన్ ఉంటుందని, ఆగస్టు 1 నుండి సర్ట్ఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుందని, అర్హత పొందిన అభ్యర్ధుల జాబితాను ఆగస్టు 13న ప్రకటించడం జరుగుతుందని చెప్పారు.
ఎంపికైన అభ్యర్థులకు రాష్టస్థ్రాయి ర్యాంకులను ఆగస్టు 16న కేటాయించి, 17 నుండి వెబ్ ఆప్షన్లకు అనుమతిస్తారు. 20న సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్లు పొందిన వారు ఆగస్టు 21 నుండి ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఖాళీ సీట్లకు ఆగస్టు 24 నుండి రెండో దశ కౌనె్సలింగ్ జరుగుతుంది, వారికి 27న సీట్లు కేటాయిస్తారు. రెండో దశలోనూ సీట్లు మిగిలితే ఆగస్టు 31న స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయి.
రేపు కేఎంఐటీ వ్యవస్థాపక దినోత్సవం
కేఎంఐటీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈ నెల 20న నిర్వహిస్తున్నట్టు కేఎంఐటీ జాయింట్ సెక్రటరీ బీ శ్రీ్ధర్‌రెడ్డి, కోశాధికారి ఎల్ ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి హాజరవుతారని, కార్యక్రమానికి క్యాట్ చైర్మన్ జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి అధ్యక్షత వహిస్తారని చెప్పారు. గౌరవ అతిథిగా కేఎంఐటీ ఉపాధ్యక్షుడు జె నరసింహరావు హాజరవుతారని పేర్కొన్నారు.
డిపార్టుమెంటల్ పరీక్షల రెస్పాన్స్ షీట్‌ల విడుదల
డిపార్టుమెంటల్ పరీక్షల రెస్పాన్స్ షీట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ విడుదల చేసింది. అభ్యర్ధులు వాటిని వెబ్ పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి పేర్కొన్నారు.
ఓపెన్ వర్శిటీ సెమిస్టర్ షెడ్యూలు విడుదల
అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 26 నుండి సెప్టెంబర్ 1 వరకూ నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌కు ఆగస్టు 13 చివరి తేదీ అని వారు చెప్పారు. పరీక్షలు మధ్యాహ్నం రెండు నుండి సాయంత్రం ఐదు వరకూ జరుగుతాయి. విద్యార్థులు వర్శిటీ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని వారు చెప్పారు. కాగా. బీసీ గురుకులాల్లో ఉన్న సీట్లను రెట్టింపు చేయాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ రాములు యాదవ్ కోరారు. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా గురుకులాల్లో 28వేల సీట్లు మాత్రమే ఉండటం వల్ల తీవ్రమైన పోటీ నెలకొందని, తక్షణమే సంక్షేమ మంత్రి చొరవ తీసుకుని సీట్లను రెట్టింపు చేయాలని కోరారు.
ఆచార్య వేల్చేరు నారాయణరావుకు సంస్కృతి పురస్కారం
మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని ఈ ఏడాది ఆచార్య వేల్చేరు నారాయణరావుకు ఆగస్టు 5వ తేదీన అందజేయనున్నట్టు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య అలేఖ్య పుంజాల తెలిపారు. విదేశాల్లో , రాష్ట్రేతర ప్రాంతాల్లో నివసించే తెలుగు వారి విద్యా సాంస్కృతిక అవసరాలు తీర్చడానికి ఆయా ప్రాంతాల్లో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ, పరివ్యాప్తికి విశేషకృషి చేసిన స్మరణీయుడు మండలి వెంకట కృష్ణారావు పేరిట తెలుగు విశ్వవిద్యాలయం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసిందని అన్నారు.