తెలంగాణ

12మంది ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌కు ప్రత్నామ్నాయం బీజేపీయేనని.. దానికి కట్టుబడి ఉన్నానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై యుద్ధం చేయాలంటే కుంతియా లాంటి నేతలు సరిపోరని మాత్రమే తాను అన్నట్లు తెలిపారు. దానిని తప్పుగా అర్థం చేసుకున్న పార్టీ నేతలు షోకాజ్ నోటీసులిచ్చారని, అందుకు తాను బదులిచ్చానని ఇంతవరకు పార్టీ అధి నాయకత్వం ఎలాంటి బదులివ్వలేదని చెప్పారు. ‘కాంగ్రెస్ అభిమానిని.. గెలుపు కోసం కష్టపడ్డాం.. కాంగ్రెస్ శాసనసభ్యునిగా గెలుపొందా’నని తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురువారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ రాష్ట్రంలో బులోపేతమవుతుందన్నారు. రాజగోపాల్‌రెడ్డి ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం లోపం వల్లే ఎన్నికల్లో పార్టీ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారారని, అధి నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం 12 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోలేక పోయిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్, రాష్టవ్య్రాప్తంగా కాంగ్రెస్ బలంగా ఉన్నా నాయకత్వ లోపం వల్ల పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. తనకు షోకాజ్ నోటీసు ఇచ్చారని.. దానికి సమాధానం కూడా ఇచ్చిన్నట్లు తెలిపారు. ఈ విషయంలో యూటర్న్ తీసుకోవడం లేదని, ప్రస్తుతం తాను కాంగ్రెస్ సభ్యునిగానే కొనసాగుతానని, బీజేపీలో చేరుతారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. బీజేపీ వాళ్లు తనను పిలవలేదని, అయనా.. తాను వెళ్లడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటే తనకు ఎంతో అభిమానమని తనకు రాజకీయ జన్ననిచ్చిన పార్టీ అని, పార్టీ బాగు కోసమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
చిత్రం...మీడియా పాయంట్ వద్ద మాట్లాడుతున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి