తెలంగాణ

ప్రధాని మోదీపై వ్యాఖ్యలు అనుచితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: ప్రధాని నరేంద్రమోదీ గెలుపు గెలుపేనా అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ విరుచుకుపడ్డారు. రెండవసారి ముఖ్యమంత్రి అయిన సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. దేశ ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీని బీజేపీకి ఇచ్చారన్నారు. 303 సీట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. శుక్రవారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దెబ్బతిన్నారన్నారు. బీజేపీకి 130 కంటే మించి సీట్లు రావని ఆశించి కేసీఆర్ భంగపడ్డారన్నారు. ప్రజా తీర్పును తక్కువ చేసి మాట్లాడితే ప్రజలు సహించరన్నారు. తెలంగాణలో బీజేపీ గాలికి కేసీఆర్ కుమార్తె కవిత, సమీప బంధువు వినోద్ కుమార్ ఓడిపోయారన్నారు. ఈ షాక్ నుంచి కేసీఆర్ ఇంకా తేరుకోలేదన్నారు.
మున్సిపల్ చట్టం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తుంది: బీజేపీ
కొత్త మున్సిపల్ చట్టంలోని అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని, స్థానిక సంస్థల అధికారాలను నిర్వీర్యం చేస్తాయని, వెంటనే గవర్నర్ జోక్యం చేసుకోవాలని బీజేపీ ప్రతినిధుల బృందం గవర్నర్‌ను కలిసి కోరింది. సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ప్రతినిధులు గవర్నర్‌ను శుక్రవారం కలుసుకున్నారు. బండ్లగూడ, మీర్‌పేట, బోడుప్పల్, ఫీర్జాదీగూడ, జవహర్‌నగర్, నిజాంపేటలను నగరపాలక సంస్థలుగా మార్చడం వెనక ఉద్దేశ్యమేమిటన్నాలరు. మణికొండ, నార్సింగిలను మున్సిపాలిటీలుగా ఉంచారన్నారు. నిన్న మొన్నటి వరకు ఇవన్నీ గ్రామపంచాయతీలన్నారు. మున్సిపాలిటీల ఏర్పాటులో హేతుబద్ధీకరణ లేదన్నారు. హెచ్‌ఎండీఏ మున్సిపాలిటీలను మున్సిపాలిటీలుగా మార్చడమేంటన్నారు.