తెలంగాణ

వ్యవసాయ వర్శిటీకి ఐకార్ ర్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/రాజేంద్రనగర్, జూలై 19: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఐకార్ ప్రకటించిన ర్యాంకుల్లో దక్షిణాది వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో అగ్రస్థానం దక్కింది. దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఆరో స్థానాన్ని సాధించింది. 33 అంశాల ఆధారంగా వ్యవసాయ పరిశోధనా మండలి ఈ ర్యాంకులను కేటాయించింది. ర్యాంకుల వివరాలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఢిల్లీలో విడుదల చేశారు. 2016 సంవత్సరంలో జాతీయ స్థాయిలో 12వ ర్యాంకు సాధించిన జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2018ర్యాంకుల్లో తన స్థానాన్ని మెరుగుపరుకుంది. ఛాన్సలర్ , గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం కేసీఆర్, వ్యవసాయ మంత్రి ఇతర అధికారుల సహకారంతోనే ఈ ర్యాంకును సాధించగలిగామని ఉపకులపతి డాక్టర్ వీ ప్రవీణ్‌రావు పేర్కొన్నారు. వర్శిటీని జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అగ్రభాగాన నిలిపేందుకు సిబ్బంది అంతా పునరంకితం అయ్యారని అన్నారు. సామాజిక, పర్యావరణ బాధ్యతలతో ప్రపంచస్థాయిలో పోటీ పడగలిగే వ్యవసాయరంగం నిపుణులను తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. 2014లో స్థాపితమైన పీజేటీఎస్‌ఏయూ వ్యవసాయం, వ్యవసాయ ఇంజనీరింగ్, కమ్యూనిటీ సైన్స్‌లలో 9 కాలేజీల్లో బోధన నిర్వహిస్తోందని పేర్కొన్నారు. సుమారు 500 మంది బోధన సిబ్బంది, ఐదు వేల మంది విద్యార్థులకు బోధన అందిస్తోందని అన్నారు. అధునాతన ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీలు, పరిశోధనా క్షేత్రాలు, వసతి గృహాలతో వర్శిటీ అభివృద్ధి పథంలో నడుస్తోందని పేర్కొన్నారు.