తెలంగాణ

లౌకికవాద పరిరక్షణలో తెలంగాణ ముందంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 20: మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శమని, లౌకికవాదాన్ని పరిరక్షించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. సెక్యూలరిజం పరిరక్షణ విషయంలో సీఎం కేసీఆర్ కఠినంగా వ్యవహరిస్తారన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పబ్లిక్‌క్లబ్‌లో నిర్వహించిన హజ్ యాత్రికుల వీడ్కోలు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముస్లింల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముస్లింల స్థితిగతులపై సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న సీఎం కేసీఆర్ వారి సంక్షేమానికి అనేక పథకాలను అమలుచేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ముస్లింలకు బడ్జెట్‌లో రూ.1,000 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. విద్యా ద్వారానే ముస్లిం కుటుంబాలను వృద్దిలోకి తీసుకోవాలనే సంకల్పంతో రాష్ట్రంలో ప్రత్యేకంగా మైనార్టీ గురుకులాలను ప్రారంభించడం జరిగిందన్నారు. అంతేకాకుండా పేద ముస్లింల ఆడపిల్లల వివాహాలకు షాదీ ముబారక్ పథకం కింద లక్ష రూపాయల చొప్పున సాయం అందిస్తున్నామన్నారు. ముస్లింల ఆర్ధిక స్థితిగతుల్లో మార్పులు తెచ్చేందుకు ఉపాధి పథకాలను అమలుచేస్తున్నామన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ప్రతి ముస్లింకు హాజ్‌యాత్ర చేయాలన్నది స్వప్నంగా భావిస్తారన్నారు. హాజ్‌యాత్రికుల కోసం ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. హాజ్‌యాత్రకు వెళ్తున్న ముస్లిం సోదరులంతా అల్లాను ప్రసన్నం చేసుకొని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్, ముస్లిం మతపెద్దలు వౌలాన అక్తర్‌సాబ్, ఖలీల్, సలీం తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... హజ్ యాత్రికుల వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతున్న విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి