తెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయి విద్యుత్ సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహదేవ్‌పూర్, జూలై 21: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయి విద్యుత్ అందిస్తున్నామని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజల అనంతరం అధికారులతో కలిసి మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణాలను, కనె్నపల్లి విద్యుత్ కేంద్రంతో పాటు కంట్రోల్‌రూంలను పరిశీలించారు. అదేవిధంగా విద్యుత్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్యానల్ బోర్డులను పరిశీలించడంతో పాటు అధికారులకు పలు సూచనలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే విధానాన్ని, నిర్మాణాలను పరిశీలించిన సీఎండీ ఇంజనీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తిని అందించేందుకు జెన్‌కో కృషి చేస్తుందని, అందుకు అధికారులందరూ సమష్టిగా పని చేయాలని ఆయన అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుత్ సేవల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట జెన్‌కో ట్రాన్స్‌కో అధికారులతో పాటు ప్రాజెక్టుల ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.

చిత్రం...పంపుహౌస్‌లో ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడుతున్న సీఎండీ ప్రభాకర్‌రావు