తెలంగాణ

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 22: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపి జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జి కృష్ణదాస్ అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సోమవారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగామాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో నియంత పాలన కొనసాగిస్తున్నాడని ఆయన అన్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రంలో బీజేపీలోకి అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన అన్నారు. ప్రజలు ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం వైపు మొగ్గుచూపుతున్నారని ఫలితంగానే తెలంగాణలో అనూహ్యంగా నాలుగు పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నామని అన్నారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పవిత్రమైన కాశి సన్నిధానంలో సభ్యత్వ కార్యక్రమం ప్రారంభిస్తే, బీజేపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం పట్ల జాతీయ నాయకత్వం ఎంతో నమ్మకంతో ఉందని తెలిపారు. కనీసం ఒక్క శాతం ఓటు బ్యాంక్ కూడా లేని త్రిపుర రాష్ట్రంలో నేడు అధికారంలోకి వచ్చామని, అదే విధంగా రానున్న 2023 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలోకి రావడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నేడు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తుడిచిపెట్టుకొని పోయాయని రేపు కుటుంబ పార్టీ అయిన టీఆర్‌ఎస్ పార్టీకి కూడా అదే గతి పడుతుందని అన్నారు. పలువురు భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరిలో ముఖ్యులు కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు అవినాష్, టీఆర్‌ఎస్ నాయకులు శ్రీకాంత్, చందు తదితరులు ఉన్నారు. వీరికి కష్ణదాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.