తెలంగాణ

హాజీపూర్ బాధిత కుటుంబాలను ప్రియాంక గాంధీ వద్దకు తీసుకెళ్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మలరామారం, జూలై 22: భువనగిరి జిల్లా హాజీపూర్ బాధిత కుటుంబాలతో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు సోమవారం గాంధీభవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైకో చేతిలో హతమైన మనీషా, కల్పన, శ్రావణి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. రాష్ట్ర ముఖ్యముంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ ట్వీటర్‌లో స్పందించి మాట్లాడి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, హాజీపూర్ గ్రామాన్ని త్వరలో సందర్శిస్తానన్న మాట ఏమైందని ఆయన ప్రశ్నించారు. కలెక్టర్ ఇచ్చిన హమీలకు కూడా ఇప్పటివరకు అమలుకాలేదన్నారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో న్యాయం చేయకపోతే ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వద్దకు బాధిత కుటుంబాలను తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో సర్పం చ్ తిరుమల కవితవెంకటేష్, బాధితులు తుంగలి నందం, పాముల నర్సింహ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...హాజీపూర్ బాధిత కుటుంబాలతో సమావేశమైన వీహెచ్