తెలంగాణ

ఎంసెట్ టాపర్ కుశ్వంత్‌కు ప్రభుత్వ చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, జూలై 23: ఎంసెట్ టాపర్ కుశ్వంత్‌కు ప్రభుత్వం అండగా నిలిచింది. 2019 జూన్ 10న ‘ఆంధ్రభూమి’లో ‘సీటు రమ్మంటోంది... ఫీజు పొమ్మంటోంది’ అనే శీర్షికన కుశ్వంత్ ఆర్థిక పరిస్థితిపై కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎంసెట్‌లో మొదటి ర్యాంకు, ఎయమ్స్‌లో జాతీయస్థాయలో 19వ ర్యాంకు సాధించిన కుశ్వంత్‌కు చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేక బాధపడుతున్న విషయం ప్రచురించడంతో స్పందించిన కేటీఆర్ ఉన్నత చదువుల కోసం వెళ్లే ముందు తనను కలవాలని కుశ్వంత్‌కు చెప్పారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ రూరల్ జడ్పీఛైర్‌పర్సన్ గండ్ర జ్యోతి కుశ్వంత్‌పై ‘ ఆంధ్రభూమి’ కథనాలను తెలుసుకుని గత నెలలో రూ.లక్ష ఆర్థిక సాయంతో పాటు ఓ ల్యాప్‌టాప్‌ను అందజేశారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయమ్స్‌లో చేరిన కుశ్వంత్‌కు తాజాగా కేటీఆర్ కార్యాలయం నుండి మంగళవారం ఫోన్ చేసి హైదరాబాద్ రావాల్సిందిగా తెలిపారు. కుశ్వంత్ మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని కలిసి కేటీఆర్ కార్యాలయం నుండి వచ్చిన సమాచారాన్ని వివరించగా ఎమ్మెల్యే కూడా కేటీఆర్ కార్యాలయ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. బుధవారం కేటీఆర్ పుట్టిన రోజు ఉండటంతో గురువారం హైదరాబాద్ రావాల్సిందిగా తెలిపారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గురువారం కుశ్వంత్‌ను కేటీఆర్ కార్యాలయానికి తీసుకెళ్తామని, ప్రభుత్వం నుండి ఆర్థికసాయం అందించనున్నట్టు తెలిపారు. అదే విధంగా స్థానిక సింగరేణి జీఎం నిరీక్షణ్‌రాజ్‌తో కూడా మాట్లాడానని, బుధవారం కుశ్వంత్‌కు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా కుశ్వంత్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందించిన సహాయాన్ని సద్వినియోగం చేసుకుని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని గండ్ర కుశ్వంత్‌కు సూచించారు. తన పరిస్థితిపై స్పందించి ‘ ఆంధ్రభూమి’లో కథనాలు రావడం పట్ల కుశ్వంత్ హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.