తెలంగాణ

సంపూర్ణ పారిశుద్ధ్య జిల్లాగా సూర్యాపేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట: బహిరంగ మలమూత్ర విసర్జన రహిత సంపూర్ణ పారిశుద్ధ్య జిల్లాగా సూర్యాపేట ఘనత సాధించింది. జిల్లాలోని 23 మండలాలు, 475 గ్రామపంచాయతీలు, ఐదు మున్సిపాలిటీల్లో నివసిస్తున్న కుటుంబాల వారంతా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేయడంతో మంగళవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూర్యాపేటను ఓడీఎఫ్ జిల్లాగా అధికారికంగా ప్రకటించారు. జడ్పీ చైర్‌పర్సన్ గుజ్జ దీపిక, కోదాడ, తుంగతుర్తి ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, గాదరి కిశోర్‌కుమార్, జిల్లా కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్‌లతో కలిసి ఓడీఎఫ్ జిల్లాగా మారినట్టుగా ముద్రించిన ఫ్లెక్సీని ఆవిష్కరించారు. 2014లో జిల్లాలో నిర్వహించిన క్షేత్రస్ధాయి సర్వేలో జిల్లాలో మొత్తం 1,59,808 కుటుంబాలు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో 1,28,803 కుటుంబాల వారికి వ్యక్తిగత మరుగుదొడ్లు లేనట్టు గుర్తించి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ఆయా కుటుంబాల వారు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా అవగాహన కల్పించారు. ఇందుకోసం గ్రామాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలను సైతం చేపట్టారు. మొత్తం మరుగుదొడ్లు లేని కుటుంబాల్లో 1,20,803 కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టు తేల్చి వారికి 2014 నుండి స్వచ్ఛ భారత్ పథకం కింద 72,282 కుటుంబాల వారికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. అంతేకాకుండా మరో 48,666 కుటుంబాలకు నిర్మల్‌భారత్ అభియాన్ పథకం కింద మరుగుదొడ్లను నిర్మించారు. ఈ ప్రక్రియ అంతా పూర్తికావడంతో జిల్లాను సంపూర్ణ పారిశుద్ధ్య జిల్లాగా మార్చినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓడీఎఫ్ జిల్లాగా మార్చేందుకు జిల్లా యంత్రాంగం సమష్టిగా చేసిన కృషి అభినందనీయమన్నారు. అధికారుల పాత్ర కీలకమని, అదే సమయంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చేపట్టే అన్ని కార్యక్రమాలు విజయవంతంమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పి.చంద్రయ్య, డీఆర్‌డీఎ పీడీ సుందరి కిరణ్‌కుమార్, జడ్పీ సీఈవో విజయలక్ష్మీతో పాటు పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
చిత్రం...సూర్యాపేటను ఓడీఎఫ్ జిల్లాగా ప్రకటిస్తున్న విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి