తెలంగాణ

హరితహారం విజయవంతమైతే ప్రోత్సాహకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసే గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల, పనుల మంజూరులో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హామీ ఇచ్చారు. హరితహారం తదితర అంశాలపై మంగళవారం ఆయన సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. హరితహారం విజయవంతం అయ్యేందుకు సంబంధిత శాఖల అధికారులంతా సమిష్టిగా పనిచేయాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, సర్పంచ్‌లు, పంచాయతీ సభ్యులు, అధికారులు శ్రద్దగా పనిచేసేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమం సజావుగా కొనసాగించే పంచాయతీలకు భవనాల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం తదితర పనుల్లో గుర్తింపు ఇచ్చి నిధులు తక్షణమే విడుదల చేస్తామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఉండాలన్నారు. ఉపాధిహామీ పథకం సజావుగా సాగేలా చూడాలని, ఈ పథకానికి కేటాయించే నిధులు శాస్ర్తియ విధానంలో ఖర్చు చేయాలని దయాకర్‌రావు సూచించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1406 కోట్ల రూపాయలతో ఉపాధిహామీ పనులు జరిగాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ నిధులు రాబట్టేందుకు ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలన్నారు. గ్రామ పంచాయతీకి సొంత భవనాలు లేని చోట అవసరమైన స్థలం ఉంటే వెంటనే నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డులు ఉండాలని వైకుంఠధామాలు ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న ఉపాధిహామీ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీజనల్ వ్యాదులు ప్రబలకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ నీతూ ప్రసాద్, ఉపాధి హామీ జాయింట్ కమిషనర్ వెస్లీ, డిప్యూటీ కమిషనర్లు సుధాకర్, రామారావు తదితరులు పాల్గొన్నారు.