తెలంగాణ

ప్రైవేటు వర్సిటీలపై 26న చలో ప్రగతి భవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రైవేటు యూనివర్శిటీల బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని పీడీఎస్‌యూ ప్రధానకార్యదర్శి బోయిన్‌పల్లి రాము పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని, పీజీ సెంటర్లను ఎత్తివేతను విరమించుకోవాలని ఆయన చెప్పారు. ఈ రెండు డిమాండ్లతో ఈ నెల 26న ఛలో ప్రగతిభవన్ నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే రాష్ట్రంలో ఉన్న యూనివర్శిటీలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, కానీ ఆయన ఆచరణ చూస్తే ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగాక బోడి మల్లన్న అన్న చందంగా ఉందని రాము విమర్శించారు. ప్రభుత్వ యూనివర్శిటీలకు నిధులు కేటాయించకుండా కేవలం ఉన్నత వర్గాలకు మాత్రమే విద్య అందించేలా ప్రేవేటు యూనివర్శిటీలకు అనుమతి ఇస్తున్నారని అన్నారు. ఈ పాలనా విధానాల వల్ల పేదలకు విద్య అందని ద్రాక్షగానే మిగులుతుందని అన్నారు. రాష్ట్రంలో 42 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పీజీ కోర్సులు నడుస్తున్నాయని, కానీ ఈ విద్యా సంవత్సరం నుండి వాటిని ఎత్తివేయాలనే ప్రణాళిక రూపొందించారని, దీనివల్ల పేద విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.