తెలంగాణ

ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 11: ప్రమాదకర స్థితిలో కృష్ణానది వరద ప్రవాహం కొనసాగుతోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలు కృష్ణానది వరద ఉద్ధృతిని పెంచింది. దాంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు నిండుకుండులా మారాయి. కర్నాటక రాష్ట్రం నుండి వస్తున్న వరద ఏకంగా 8.50 లక్షల క్యూసెక్కులకు చేరింది. కృష్ణానది ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఆదివారం నది నిండుకుండలా మారి పంటపొలాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దాదాపు పదివేలకు ఎకరాలకు పైగా పంటలు నీట మునిగాయి. నది తీరప్రాంతంలోని వరి, పత్తి పంటలు నీటి మునిగి దెబ్బతిన్నాయి. అల్మటి ప్రాజెక్టు నుండి నారాయణపూర్ ప్రాజెక్టుకు 8.70 లక్షల క్యూసెక్కుల వరదనీటిని విడుదల చేశారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుండి జూరాల ప్రాజెక్టుకు 8.60 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. దాంతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చి జూరాలకు తాకింది. జూరాల ప్రాజెక్టుకు వరద మరింత పెరడగంతో జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన 57 గేట్లు ఎత్తివేసి శ్రీశైలం జలాశయంలోకి 8.50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. కృష్ణానది ఒడ్డున గల పుణ్యక్షేత్రాలు కృష్ణమ్మ వరద ప్రవాహంతో నీటమునుగుతున్నాయి. అటు కృష్ణానది, ఇటు భీమా నదుల నుండి ప్రవాహం రావడంతో జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జూరాల నుండి శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో బీచ్‌పల్లి దగ్గర గల రామాయలం జలదిగ్బంధంలో చిక్కింది. కృష్ణానది ఒడ్డున గల పుణ్యక్షేత్రాల పుష్కరఘాట్లన్నీ జలదిగ్బంధంలో మునిగిపోయాయ. పుష్కరఘాట్లు వరదతో ముంపునకు గురికావడంతో నదివైపు ప్రజలను వెళ్లకుండా అధికార యంత్రాంగం హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. కృష్ణానదిలో గల సంగమేశ్వర దేవాలయం ఆదివారం సాయంత్రం నాటికి ఆయల శిఖరం మాత్రం కొద్దిగా కనబడుతోంది. మరికొన్ని గంటల్లో సంగమేశ్వర దేవాలయం పూర్తిగా నీటమునగనుంది.
శ్రీశైలం బ్యాక్‌వాటర్ మరింత పెరిగింది. దాదాపు 200 టీఎంసీలకు శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం చేరడంతో ప్రాజెక్టును సందర్శించేందుకు పర్యాటకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. అయితే నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైలం వెళ్లే రోడ్డు మార్గం ట్రాఫిక్ జామ్ అయింది. నదితీరానికి దగ్గరగా ఉన్న గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. బీచ్‌పల్లి సమీపంలోని గ్రామాలన్నింటినీ అధికారులు ఖాళీ చేయాలని ఆదేశించగా ప్రజలు ట్రాక్టర్లను తీసుకువచ్చి ఇంట్లోని సామాగ్రిని ఖాళీ చేయిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లను ఎత్తివేయడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి సైతం దాదాపు 8.40 లక్షల క్యూసెక్కుల వరద వెళ్తుంది. కృష్ణానది పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తుంది. దాంతో శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు సందర్శకులు పెద్దఎత్తున తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికారులు పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కాగా 2009లో వచ్చిన వరద ప్రవహం మళ్లీ పదేళ్ల తర్వాత కృష్ణానదికి వచ్చిందని అప్పటి చేదు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ భయాందోళనకు గురవుతున్నారు.