తెలంగాణ

టీఆర్‌ఎస్‌కు బీజేపీయే ప్రత్యామ్నాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 11: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయం అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ పట్టణంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో పని చేస్తున్న ప్రముఖల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎన్నో చారిత్రాత్మకమైన విషయాలను తీసుకుని ప్రజల మన్ననలు పొందుతోందని అన్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 370 ఆర్టికల్ రద్దు చాలా సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వార్థరాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ చేసిన కృషి అమోఘం అని యావత్తు తెలంగాణ ప్రజానీకం ఆమె మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని రాష్ట్ర ప్రజలు వారికి తోచిన విధంగా సంతాపం తెలిపారని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సుష్మాస్వరాజ్‌కు సంతాపం తెలపకపోవడం విచారకరమని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలంటూ బిల్లును పార్లమెంట్‌లో పెట్టాలంటూ యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన విషయాన్ని తెలంగాణ ప్రజలంతా చూశారని సుష్మాస్వరాజ్ పక్కన నోరు మెదపకుండా నిలిచి ఉండి ఆమె ప్రసంగాన్ని విన్న కేసీఆర్ ఆమె మృతికి ప్రభుత్వ పరంగా సంతాపం తెలపకపోవడం చూస్తుంటే మానవత్వం లేని మనిషిగా కేసీఆర్ మారాడని అన్పిస్తోందని దుయ్యబట్టారు. చింతమడక గ్రామంలోని ప్రతి కుటుంబానికి పది లక్షల లాభం చేకూరుస్తానని చెప్పిన ఆయన రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి లాభం చేకూర్చాలని, ఆయన కేవలం ఒక్క గ్రామానికి కాకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయం కేసీఆర్ గుర్తుంచుకోవాలని హితవుపలికారు. రాష్ట్రంలో అమలు అవుతున్న కేంద్ర పథకాలను తమ పథకాలుగా టీఆర్‌ఎస్ నాయకులు చెప్పుకోవడం సిగ్గు చేటని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుంటే టీఆర్‌ఎస్ నాయకులు వణుకుతున్నారని ఎద్దేవా చేవారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచంలోనే ఓ గొప్ప నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారని 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీర్‌లో ఉగ్రవాదులను తుదముట్టించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. తెలంగాణలో సైతం బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
దేశ వ్యాప్తంగా బీజేపీ విస్తరించిందని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, నాయకులు శాంతికుమార్, పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.