తెలంగాణ

హైడల్ ప్రాజెక్టుల నుంచి 2475 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో సాగునీటి ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారగా వచ్చిచేరుతోంది. దీంతో ఆయా ప్రాజెక్టుల వద్ద హైడల్ విద్యుత్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. జల విద్యుత్ ప్రాజెక్టుల నుంచి రోజూ 2475 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని ట్రాన్స్‌కో జెన్‌కో పేర్కొంది. ఒక్క శ్రీశైలం నుంచి 2243 మెగావాట్ల, జూరాల ప్రాజెక్టు నుంచి 145, నాగార్జునసాగర్ నుంచి వందకుపైగా జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. సాగర్‌లో నీటిమట్టం పెరిగితే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. మరో వారం రోజుల్లో 5వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి దాటుతుందని అధికారులు గుర్తు చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయిలో 885 అడుగులకు చేరడంతో ప్రస్తుత సీజన్‌లో ఇటు విద్యుత్ అటు సాగునీటికి కొరత ఉండకపోవచ్చునని అధికారులు చెబుతున్నారు. మరో 10 రోజుల్లో ప్రస్తుతం కొనసాగుతున్న వరద ఉద్ధృతితో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయికి చేరుకుంటుందని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో సైతం రైతులు ఎక్కువగా విద్యుత్ వాడకాన్ని వినియోగిస్తున్నారు.