తెలంగాణ

యాదవ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: యాదవ సామాజికవర్గం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యాదవ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, ఏటా రూ. 2వేల కోట్ల నిధులను కేటాయించాలని యాదవ్ హక్కుల పోరాట సమితి నిర్ణయించింది. ఆదివారం నగరంలో యాదవ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ తీర్మానం చేసింది. షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ సమావేశంలోనే యాదవ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడిగా చిర్రబోయిన భద్రినాధ్‌యాదవ్‌ను నియమిస్తూ నియామక పత్రాన్ని కూడా అందజేశారు. ఈ సందర్భంగా భద్రినాథ్ యాదవ్ మాట్లాడుతూ యాదవులు ఆర్థికంగా, రాజకీయంగా ఐక్యంగా కలిసి ఎదగాలని పలుపునిచ్చారు. యాదవ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ త్వరలోనే ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. అంతేగాక, ప్రతి మండలంలో యాదవ హక్కుల పోరాట సమితులను ఏర్పాటు చేసి, మరింత పటిష్టం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమితుల ద్వారా యాదవులను సంఘటితం చేసి, తెలంగాణ రాష్ట్రంలో యాదవుల సత్తా చాటుతామని అన్నారు. యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ మాట్లాడుతూ ఆదివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో మూడు తీర్మానాలు చేసినట్లు వెల్లడించారు. రిజర్వేషన్లు, కార్పొరేషన్ ఏర్పాటు, రాష్ట్రంలో ఉన్న 241 మండలాల్లో పోరాట సమితులను ఏర్పాటు చేయాలంటూ మూడు తీర్మానాలు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో హక్కుల పోరాట సమితి నేతలు డా.రవికిరణ్ యాదవ్, రాజారాం యాదవ్, ఇన్‌స్పెక్టర్ నాగేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.