తెలంగాణ

విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణ ప్రభుత్వం వైద్య, విద్యా రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. ఆదివారం ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా, వైద్య రంగాల సేవలను ప్రజలకు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో పేదలకు ఇస్తామన్న సంక్షేమ పథకాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తామంటూ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ పథకం పడకేసిందని, అందులో పని చేస్తున్న సిబ్బందికి జీతాలు ఇవ్వడం మానేసిందన్నారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు ధర్నాలు చేయాల్సి వస్తోందని ఆయన నిప్పులు చెరిగారు. ఈనెల 15లోపు బకాయిలు ఇవ్వకపోతే ఆరోగ్య సేవలు నిలిపివేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం ఏమిటని ఆయన నిలదీశారు. ఆరోగ్యశ్రీకి దాదాపు రూ.1500 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం పేదల ప్రాణాలు గాలిలో దీపం మాదిరిగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన రాయితీలపై కేంద్రాన్ని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ప్రశ్నించే గొంతులు ఉండాలని కేటీఆర్ మాట్లాడుతున్నారు. అయితే, టీఆర్‌ఎస్‌లో చేరితేనే తెలంగాణవాదులు లేకుంటే తెలంగాణ ద్రోహులుగా ముద్రవేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్ సిరిసిల్ల పర్యటన సందర్భంగా పెద్దాసుపత్రిలో గైనకాలిస్టు లేరా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం వింతగా ఉందన్నారు. తెలంగాణ ఆసుపత్రుల్లో కూడా గైనకాలిస్టులు లేరన్న విషయాలను కేటీఆర్ గ్రహిస్తే మంచిదన్నారు.
గతంలో టీఆర్‌ఎస్ అనుసరించిన విధానాలనే ఇప్పుడు బీజేపీ అనుసరిస్తోందని ఆయన కనె్నర్ర చేశారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వం అంటూ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కొన్ని పార్టీలకు టూ లేట్ బోర్డ్‌లు తగిలించుకోవాలని లక్ష్మణ్ చెప్పడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీలో పదవులు, అధికారం, ఆర్థికంగా లబ్ధిపొందిన వారే నేడు టీడీపీపై విషం చల్లే ప్రయత్నం చేయడం శోచనీయమన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇక లేదంటూ బీజేపీ నేతలు మరీ ఫోన్లు చేస్తున్నారన్నారు. ఇలాంటి జిమ్మిక్కులు బీజేపీ నేతలు చేయడం చూస్తే రాజకీయాలను దిగజార్చడమేనని ఆయన హెచ్చరించారు. సోమవారం బక్రీద్ సందర్భంగా మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.