తెలంగాణ

వరుస సెలవులతో ప్రైవేట్ ఆపరేటర్ల దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: వరుస సెలవులు వచ్చాయంటే ప్రైవేట్ ఆపరేటర్లకు పండగే. ఉన్నఫళంగా టిక్కెట్లు అమ్ముడుపోయాయని బోర్డులు పెట్టేస్తారు. ఇక ప్రయాణికులకు చుక్కలు చూపిస్తారు. పెంచిన చార్జీలను చూచి ప్రయాణికులు లబోదిబోమన్నారు. ఇదేమిటి ఇంత దోపిడీనా అంటూ ప్రైవేట్ ఆపరేటర్లపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు బస్సు ఆపరేటర్లకు మధ్య వాగ్వాదాలు జరిగాయి. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం (9వ తేదీ) నుంచి 15 (పంద్రాగస్టు) వరకు సెలవులు రావడంతో ప్రయాణికుల సొంత ఊళ్ళకు పరుగుతీస్తున్నారు. 13,14 తేదీల్లో పని దినాలు ఉన్నా వరుస సెలవులతో పనిదినాలను సెలవులుగా అనుమతులు పొందారు. దీంతో దాదాపు 7 రోజులు సెలవులు వచ్చాయి. ఇక వారం రోజులు ఆనందంగా గడపవచ్చునంటూ ఊళ్ళకు బయలుదేరారు. రైల్వే స్టేషన్లు, బస్సు స్టాండ్‌లు కిక్కరిసిపోయాయి. రైల్వే, బస్సు స్టాండ్‌లకు భారీగా తరలివస్తున్నారు. దీంతో ప్రైవేట్ ఆపరేటర్ల చార్జీలు భారీగా పెంచేశారు. విధిలేక ప్రయాణికులు ప్రైవేట్ ఆపరేటర్లు చెప్పిందే తడువుగా అడిగినంతా చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. రైల్వే ప్రయాణికులకు టికెట్లు రిజర్వు కాకపోవడంతో టికెట్లు వదిలేసి బస్సు ప్రయాణానికి సై అంటున్నారు. గత రెండు నెలలు క్రితం రైల్వే టికెట్లు తీసుకున్న ప్రయాణికులు రిజర్వు టికెట్ల కోసం ఎదురు చూశారు. అయితే, వెయిటింగ్ లిస్టు అంటూ చివరిదాకా ఉండడంతో రైల్వే ప్రయాణికులు నిరాశకు గురయ్యారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేస్తామన్నా భారీ వర్షాలతో ఉన్న రైళ్లనే రద్దు చేశారు. దీంతో రైల్వే ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఎక్కాల్సి వచ్చింది. రైల్వేలో చివరికి ఈక్యూ రిజర్వు చేసినవారికి సైతం టికెట్లు రిజర్వు కాకపోవడంతో సంబంధిత ప్రయాణికులు ఇంటి బాటపట్టారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, ముంబయ్, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, చెన్నై వెళ్ళే ప్రయాణికులు గమ్యస్థానాలకు వెళ్లడానికి నానా హైరానా పడ్డారు. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాతాలకు చార్జీల వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు రూ. 1800 నుంచి 2200, విశాఖపట్నంకు రూ. 2400, తిరుపతికి రూ. 1900, విజయవాడకు 950- 1100, రాజమండ్రికి రూ. 1300 నుంచి 1600, గంటూరుకు 1050-1250, నెల్లూరుకు రూ.1200-1300, చెన్నైకి 1800-2300 వరకు చార్జీలు వసూళ్లు చేశారు.