తెలంగాణ

ముందుగానే వచ్చి ఉంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, నవంబర్ 29: మానవత్వం ముందు కులం, మతం, ప్రాంతం, వయోభేదం, ఖర్చులన్ని దిగదుడుపే అని నల్గొండ జిల్లా వాసులు రుజువు చేశారు. మెదక్ జిల్లా పుల్‌కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం గ్రామంలో శనివారం ఉదయం బోరుబావిలో పడిపోయిన రాకేష్‌ను రక్షించడానికి అధికార యంత్రాంగం, జాతీయ విపత్తుల నివారణ బలగాల సిబ్బంది వచ్చినా బాలుడిని రక్షించలేకపోయారు. నల్గొండ జిల్లాలో ఇలాంటి సంఘటనలో సాహసోపేతమైన నిర్ణయంతో ఓ బాలుడిని సురక్షితంగా రక్షించిన కరుణాకర్, ఉస్మాన్, రవి, సతీష్‌లు టీవీల ద్వారా రాకేష్ సంఘటనను తెలుసుకున్నారు. సంఘటన స్థలంలో ఉన్న అధికారులకు ఈ విషయం తెలియకపోగా ఆ నలుగురు అందుబాటులో ఉన్న పరికరాలను తీసుకుని స్వంత ఖర్చులతో కారులో తెల్లవారు జామున 3 గంటలకు బొమ్మారెడ్డిగూడెం చేరుకున్నారు. బాలుడిని బయటకు తీసే విధానంపై కొంత ఆందోళన వ్యక్తం కావడంతో ఏ విధంగా బయటకు తీస్తామో అధికారులకు వివరించడంతో అనుమతి ఇచ్చారు. పొడువాటి సన్నటి రాడ్లకు క్లిప్పును తయారు చేసారు. బల్బు, సిసి కెమెరాను ముందుగా లోపలికి వదిలి బాలుడు ఏ స్థితిలో ఉన్నది తెలుసుకున్నారు. అనంతరం సన్నటి పైపుల ద్వారా క్లిప్పును లోపలికి వదిలి కాళ్లకు బిగింపజేసి బయటకులాగారు. నుదురు, చేతులకు స్పల్పగాయాలు అయ్యాయి. బావిలో పడిపోయిన వెంటనే ఈ ఆపరేషన్ చేసి ఉంటే ప్రాణాపాయం నుంచి తప్పించే అవకాశం ఉండేదని కరుణాకర్, ఉస్మాన్‌లు పేర్కొన్నారు. వెల్దుర్తి మండలానికి చెందిన శ్రీనివాస్ కూడా ఇదే పద్దతి ద్వారా బాలుడిని బయటకు తీస్తానని చెప్పినా అధికారులు సాహసించకపోవడంతో ప్రాణాలకే ముప్పు వాటిల్లింది.