తెలంగాణ

సినిమా నిర్మాణంలో ప్రపంచాన్ని శాసించే సత్తా మనది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నిజ జీవితాలూ సినిమాలను ప్రభావితం చేస్తాయని జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. సినిమా చరిత్రను సంక్షిప్తం చేసే కమిటీ ఉంటే తన వంతు తోడ్పాటు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. మన సినిమాలు పుస్తకావిష్కరణ సభలో పవన్‌కళ్యాణ్ పాల్గొన్నారు. చరిత్ర రాసేవారు లేకపోతే చరిత్ర కనుమరుగైపోతుందని, పుస్తకాల్లో నిక్షిప్తం చేయకపోతే తక్కువ స్థాయి వ్యక్తులు రాసిందే చరిత్రగా చెలామణి అవుతుందని పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎవరినైనా ఎదిరించొచ్చని, కానీ లక్షల మెదళ్లను కదిలించగలిగే శక్తి ఉన్న కవులను, రచయితలను ఎదుర్కోవడం చాలా కష్టమని అన్నారు. అలాంటి వ్యక్తుల పట్ల అపారమైన గౌరవం తనకు ఉందని, అందుకే సినిమా వేడుకుల్లో తల ఎగరేయకుండా వాళ్ల ముందు తలదించుకుని కూర్చుంటానని అన్నారు. ఎన్నో రక్తపు చుక్కలు కారితే తప్ప ఒక్క వాక్యం కూడా రాయలేమని ఒక ఇంగ్లీషు కవి చెప్పిన మాటను పవన్ ప్రస్తావిస్తూ, అలాంటిది కనిపించని రక్తాన్ని చిందించి లక్షల పేజీలు రాసిన కవులు, రచయితలకు జోహార్లని అన్నారు. ఆ కనిపించని రక్తమే మన రక్తాన్ని మరిగించి ప్రజాసమస్యలపై మాట్లాడేలా చేస్తుందని అన్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ రచయిత తెలకపల్లి రవి రాసిన ‘మన సినిమాలు-అనుభవాలు-చరిత్ర-పరిణామం’ అనే పుస్తకాన్ని పవన్‌కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు తనికెళ్ల భరణి, పరచూరి గోపాలకృష్ణ, సుద్దాల అశోక్ తేజ, రావికొండలరావు, సినీ పాత్రికేయుడు రెంటాల జయదేవ్ పాల్గొన్నారు. అన్ని మైత్రిల కంటే సాహిత్య మైత్రి చాలా గొప్పదని సీనియర్ పాత్రికేయుడు నాగేంద్ర ఒక పుస్తకం మీద రాసి తనకు ఇచ్చారని, ఆ మాట ఇప్పటికీ తనకు గుర్తుండిపోయిందని పవన్ అన్నారు. బందోపాధ్యాయ రాసిన వనవాసి పుస్తకం తనను ప్రకృతి ప్రేమికుడిగా మార్చేసిందని చెప్పారు. అలాంటి పుస్తకాన్ని తనికెళ్ల భరణి తనకు గిఫ్ట్‌గా ఇచ్చినపుడు గబ్బర్‌సింగ్ సినిమా హిట్ అయినదానికంటే ఎక్కువ ఆనందం కలిగిందని పేర్కొన్నారు. గుడిపాటి వెంకటాచలం రాసిన మైదానం పుస్తకాన్ని రాశారని తెలుసుగానీ మాలపిల్ల సినిమాకు కూడా ఆయనే రచయిత అని ఈ పుస్తకం చూసే వరకూ తనకు తెలియదని ఇలాంటి ఎన్నో విషయాలు తెలిసినపుడు వారిపై గౌరవం పెరుగుతుందని చెప్పారు. తెలుగు పరిశ్రమలో చాలా మంది గొప్ప కథకులున్నారని, బాహుబలి వంటి సినిమా వచ్చిన ఆ ఇంకా అద్భుతమైన సినిమాలు తీయగల సాహిత్యం మన దగ్గర చాలా ఉందని పవన్ అన్నారు. అది అర్థం చేసుకున్న రోజున గొప్ప సినిమాలు వస్తాయని చెప్పారు. ప్రపంచాన్ని శాసించే సినిమాలు తీయడానికి పుస్తకాలు చాలా ఉపయోగపడతాయని అన్నారు .తెలకపల్లి రవి రాసిన పుస్తకాన్ని తాను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు. జానీ సినిమా ఎందుకు ఆడలేదో అందరికంటే తనకే ఎక్కువ బాగా తెలుసని పేర్కొన్నారు. కమర్షియల్ యాంగిల్‌లో పడి అనుకున్న కథను తెరకెక్కించలేకపోయామని, పరుచూరి సోదరుల గొప్పతనం గురించి చెబుతూ ఒక సామాజిక సమస్యను కమర్షియల్ విలువలు ఉంటూనే మనం ప్రభావితం అయ్యేలా రాయగల సమర్ధులని అన్నారు. అంతటి రచనా శక్తి అందరికీ లేదని పేర్కొన్నారు. సావిత్రి, ఎస్వీ రంగారావుల గురించి ఈ తరం వారికి తెలియడం లదని, సావిత్రి గారిపై బయోపిక్ తీస్తే తప్ప వారి సామర్ధ్యం ఏమిటో గుర్తుకు రాలేదని, సినిమాలు నిజజీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో, నిజజీవితాలు కూడా సినిమాలను అంతే ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. అలాంటి సినిమాలకు జాతీయ అవార్డులు రావడం చాలా సంతోషకరమని చెప్పారు. మున్ముందు చాలా విలువలున్న సినిమాలు కూడా రావాలని పేర్కొన్నారు.
తన సినిమాల్లో ఎన్నో కమర్షియల్ హంగులు ఉన్నా సమాజానికి ఉపయోగపడే మంచిని చెప్పడానికి తనవంతు ప్రయత్నం చేశానని అన్నారు.

చిత్రం...‘మన సినిమాలు-అనుభవాలు-చరిత్ర-పరిణామం’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న పవన్ కళ్యాణ్