తెలంగాణ

ఉనికి కోసమే కాంగ్రెస్‌పై విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: తెలంగాణలో రాజకీయ ప్రయోజనం కోసమే బీజేపీ మతతత్వ విధానాలను తెరపైకి తెస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ధ్వజమెత్తారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ.. 2018 ఎన్నికల్లో 103 అసెంబ్లీ సీట్లలో బీజేపీకి డిపాజిట్లు దక్కలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి 17 శాతం ఓట్లు వచ్చాయన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ ఊసే లేదన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి బీజేపీ తోకపార్టీగా మారిందన్నారు. కేంద్రంలో బీజేపీకి టీఆర్‌ఎస్ పార్టీ తోక పార్టీ అయితే, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీ తోక పార్టీగా వ్యవహరిస్తోందన్నారు. పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు టీఆర్‌ఎస్ మద్దతు పలుకుతోందన్నారు. రాష్ట్రప్రభుత్వ పథకాలను కేంద్రమంత్రులు పొగుడుతున్నారన్నారు. తోకపార్టీ బంధం గురించి చెప్పేందుకు ఇంత కంటే నిదర్శనం ఏమి కావాలన్నారు. బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. మోదీ, కేసీఆర్‌ల మధ్య రహస్య ఒప్పందం ఉందన్నారు.
బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇష్టం వచ్చినట్లుగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ మాటలను నమ్మేస్థితిలో లేరన్నారు. బీజేపీకి సమర్థవంతమైన నాయకత్వం, కేడర్ లేదన్నారు. అందుకే ఇతర పార్టీల నేతల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారన్నారు.