తెలంగాణ

ఇదేనా ప్రజారంజక పాలన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: ఆరోగ్యశ్రీ లాంటి అద్భుతమైన వైద్య సహాయ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ విధ్వంసం చేశారని, తెలంగాణకు అన్యాయం చేశారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి చక్కగా అమలు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత వైద్య సేవల విభాగం పూర్తిగా చతికిలపడిందన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి సుపరిపాలన అందిస్తామని గతంలో హామీ ఇచ్చారన్నారు. కాని స్వాతంత్య్ర దినోత్సవం రోజే ఆరోగ్యశ్రీ పథకాన్ని నిలిపివేయడంతో లక్షలాది మంది పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజాదరణ పొందిన ఇంత మంచి స్కీంకు కేసీఆర్ నిధులు మంజూరు చేయకుండా పేదలను మోసం చేశారన్నారు. రాష్ట్రప్రభుత్వానికి ఆరోగ్య రంగంపై ఒక విధానం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఆసుపత్రులకు ఈ స్కీం కింద నిధులు ఏ మేరకు ఇవ్వాలో ప్రభుత్వానికి సరైన దృక్పథం లేదన్నారు. ఆరోగ్య శ్రీ సేవలకు నిధులు ఎగగొట్టడం ప్రజాసేవనా అని ఆయన ప్రశ్నించారు. వైద్య శాఖమంత్రి, ప్రైవేట్ ఆసుపత్రుల మధ్య పొంతన లేని ప్రకటనలు వెలువడుతున్నాయన్నారు. 108 వాహనాల ఉద్యోగులకు వేతనాలు లేవన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఆరు మాసాలు గడచిన తర్వాత ఆ ఊసు ఎత్తడం లేదన్నారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ను కాలరాస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధులు నాటిన చెట్లు కనపడకపోతే ఉద్యోగాలు పోతున్నయన్నారు. కేసీఆర్ చేసిన ప్రజా వ్యతిరేక విధానాలకు ఎలాంటి శిక్షలు విధించాలన్నారు. అంగన్‌వాడీల్లో మహిళలకు పౌష్టికాహారం, పాలు, ఇంతవరకు ఇవ్వడం లేదన్నారు. 9 మాసాల నుంచి సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్వలేదన్నారు. కేసీఆర్ అవినీతి కోసం అనేక కొత్త పథకాలు తీసుకువస్తున్నారన్నారు. కొత్త చట్టాలు తీసుకువస్తామని చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కొంత నాలుకకు మందేస్తే ఉన్న నాలుకకు ఊడినట్లుగా కేసీఆర్ కొత్త మున్సిపల్ చట్టం తీరు ఉందని ఆయన చెప్పారు.