తెలంగాణ

విద్యారంగ సమస్యలపై కలెక్టరేట్ల ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17:ప్రభుత్వ విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఆగస్టు 19న రాష్టవ్య్రాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించనున్నట్టు ఎస్‌ఎఫ్‌ఐ ఉపాధ్యక్షుడు తాటికొండ రవి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు పూర్తయినా నేటికీ విద్యారంగం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. కనీసం ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా అమలుచేయలేకపోయిందని, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుచేయలేకపోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి జావెద్, సంతోష్, సాయి, శంకర్, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భాషాపండితులు, పీఈటీలు శనివారం నాడు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆమరణ దీక్షకు దిగారు. మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య తదితరులు హాజరై వారికి మద్దతు పలికారు. చిరకాలంగా భాషా పండితులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడం లేదని వారు పేర్కొన్నారు.