తెలంగాణ

యువ ఇంజనీర్లే దేశానికి దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 17: దేశానికి యువ ఇంజనీర్లే దిక్సూచి అని థాయిలాండ్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏఐటీ) డైరెక్టర్ ప్రొఫెసర్ నితిన్‌కుమార్ త్రిపాఠి అన్నారు. శనివారం నిట్‌లో 17వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన త్రిపాఠి చేతుల మీదుగా 1507 మంది యువ ఇంజనీర్లకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వరంగల్ నిట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి త్రిపాటి మాట్లాడారు. ప్రపంచం మొత్తం నూతన టెక్నాలజీని స్వాగతిస్తుందని, ఇంజనీర్లు ఆకాశమే హద్దుగా కష్టపడి పని చేస్తే వారికి భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందన్నారు. గ్లోబల్ యుగంలో టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని, దీంతో ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సృష్టించబడుతున్నాయన్నారు. నేడు ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో భారతదేశం దూసుకపోతుందన్నారు. నేను ఒకప్పటి ఆర్‌ఈసీ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థినేనని, ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసి కాన్పూర్ ఐఐటీలో ఎంటెక్‌లో రిమోట్ సెన్సింగ్ కోర్సును ప్రొఫెసర్ల సలహాతో చేరానని ఆయన వివరించారు. 2000 సంవత్సరం తరువాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేగంగా విస్తరించిందని, ఇండస్ట్రీస్, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, సైన్స్ రంగాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పూర్తిగా అనుసంధానమయ్యాయన్నారు. ఆర్యభట్ట, చంద్రయాన్ ప్రయోగాలు స్పేస్ టెక్నాలజీతోనే సాధ్యమయ్యాయని ఆయన విద్యార్థులకు వివరించారు. ప్రస్తుతం కృత్రిమ మేధాపై విస్తృతంగా చర్చ జరుగుతుందని, రాబోయే టెక్నాలజీని ముందుగానే పసిగట్టి అందుకు అనుగుణంగా నూతన ఆవిష్కరణలు చేపట్టేందుకు యువ ఇంజనీర్లు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్రమోడి మాట్లాడిన అంశాలపై త్రిపాటి వివరిస్తూ ప్రతి ఇంజనీరు తన నైపుణ్యాన్ని వేగంగా అభివృద్ధి చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరెన్సీ డిటలైజేషన్ తరువాత ప్రపంచంలో ప్రతి రోజు 60 బ్యాంకుల బ్రాంచీలు మూత పడుతున్నాయని, మొబైల్ బ్యాంకింగ్ పూర్తి స్థాయిలో వినియోగం జరుగుతుందన్నారు. టెక్నాలజీ రంగంలో ఇదొక అద్భుతమైన మార్పు అని అన్నారు. ఒకప్పటి నిట్ విద్యార్థినైన నేను ముఖ్య అతిథిగా రావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. నిట్ డైరెక్టర్ ఎస్.వి.రమణారావు స్నాతకోత్సవం సందర్భంగా మాట్లాడుతూ నిట్‌లో పూర్తి స్థాయి పరిశోధనలను ప్రోత్సహించేందుకు 35 పరిశోధన ప్రాజెక్టులు నడుస్తున్నాయని, ఇందుకు 20 కోట్ల రూపాయలను వెచ్చించామన్నారు. గ్లోబల్ ఇన్షియేటివ్ అకాడమిక్ నెట్‌వర్క్ కార్యక్రమంలో 51 కోర్సులపై నిట్ స్టూడెంట్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత విద్యలో వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రాజెక్టులు కొనసాగుతున్నాయన్నారు. స్పార్క్ కార్యక్రమంలో భాగంగా 5.5 కోట్ల రూపాయలతో 10 రీసెర్చ్ ప్రాజెక్టులను యుకే, కెనడా, సింగపూర్, అమెరికా, తైవాన్, ఇజ్రయేల్ దేశాలతో కలిసి చేపట్టినట్లు తెలిపారు. నిట్ ఇనిస్టిట్యూట్‌లో గోల్డ్‌మెడల్ దక్కించుకున్న కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థినీ వై.సాహితీకి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెంబర్లు ప్రొఫెసర్ కె.విజయ్‌కుమార్, వి.ఎస్.కామేశ్వర్‌రావు, పులి రవికుమార్, నిట్ రిజిస్ట్రార్ ఎస్.గోవర్ధన్‌రావు, నిట్ అకడమిక్ డీఎస్ పైడిశెట్టి, డీఎల్.రాంగోపాల్‌రెడ్డి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.