తెలంగాణ

కార్పొరేట్ సంస్థలకు ఊడిగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాలు ఒకే నాణానికి బొమ్మా బొరుసులాంటివని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. బీజేపీ మతోన్మాదంతో, టీఆర్‌ఎస్ ప్రాంతీయ వాదంతో అధికారంలో కొనసాగుతున్నాయని, రెండు పార్టీలూ కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నాయని అన్నారు. ఈ పార్టీల పాలనలో దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని, సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడంతో పాటు పేద ప్రజల బతుకుల్లో వెలుగు తెచ్చేందుకు కమ్యూనిస్టు పార్టీ పోరాటాలకు సన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రెండు రోజుల వర్కుషాప్ శనివారం నాడు మఖ్దూం భవన్, రాజ్‌బహుదూర్ గౌర్ హాల్‌లో ప్రారంభం అయ్యాయి. వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు కలకొంతడ కాంతయ్య దీనికి అద్యక్షత వహించారు. వర్కుషాప్‌ను చాడ వెంకటరెడ్డి ప్రారంభించారు. స్వాతంత్య్రం సిద్ధించిన 73 ఏళ్ల తర్వాత దేవంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని, అధికార వ్యవస్థలు అన్నీ ధ్వంసం అయ్యాయని అన్నారు. పార్లమెంటులో 90 శాతం మంది కోటీశ్వర్లు, గూండాలు, అత్యాచారాలకు పాల్పడిన వారు లేదా కేసులు ఎదుర్కొంటున్న వారే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు ప్రజాస్వామ్యానికి ముప్పు అని పేర్కొన్నారు. సమాజంలో పేదరికం పోవాలని, సమగ్ర కార్మిక చట్టం కావాలని కోరుతున్నామని, రాష్ట్రంలో పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయని అన్నారు. కాళేశ్వరం బిల్లులు, ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, రెవిన్యూ చట్టాలు లోపభూయిష్టంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీకేఎంయు జాతీయ నేత గుండ మల్లేష్, కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు మోతి లింగారెడ్డి, సయ్యద్ అఫ్సర్, ప్రధానకార్యదర్శి టీ వెంకట్రాములు, డిప్యుటీ జనరల్ సెక్రటరీ తాటి వెంకటేశ్వరరావు, కార్యదర్శి అక్కపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.
చవితి ఉత్సవాల్లో మద్యం బంద్ చేయండి
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీ నుండి 11రోజుల పాటు రాజధాని నగరంలో వైన్‌షాప్‌లు, బార్‌షాప్‌లు, పర్మిట్ రూమ్‌లు బంద్ చేయాలని సీపీఐ హైదరాబాద్ సమితి కార్యదర్శి ఈటీ నరసింహ కోరారు. ఈ మేరకు ఆయన ఎక్సైజ్ శాఖ జాయింట్ కమిషనర్ ఎన్ ఏ అజయ్‌రావు, గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ వివేకానంద రెడ్డిలను కోరారు.