తెలంగాణ

బడ్జెట్‌లో పేదల సంక్షేమానికే పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: రాష్ట్రంలో పేదల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని 2019-20 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషి ఆదేశించారు. బడ్జెట్ ప్రతిపాదనలపై శనివారం ఆయన సచివాలయంలో సమీక్షించారు. బడ్జెట్ సమావేశాలు వచ్చే నెలలో జరిగే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరావు నేతృత్వంలో త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్ష జరుగుతుందన్నారు.
ముఖ్యమంత్రి వద్ద జరిగే సమీక్షా సమావేశానికంటే ముందే వివిధ శాఖల ఉన్నతాధికారులు తమ తమ శాఖలకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలకు తుది రూపం ఇవ్వాలని సూచించారు. గత ఏడాది బడ్జెట్ కేటాయింపులు, విడుదల చేసిన నిధులు, ఖర్చయిన నిధులు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఈ కారణంగానే వెంటనే సంబంధిత మంత్రులతో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించాలని సూచించారు. గత ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన నిధులు, విడుదల చేసిన నిధులు, ఖర్చయిన నిధులను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఆదాయాన్ని సమకూర్చే శాఖలు ఎంత మేరకు ఆదాయం పెరిగే అవకాశం ఉందో, అందుకు మార్గాలు ఏమిటో వివరిస్తూ నివేదికలను రూపొందించాలని సూచించారు.
ఈ సందర్భంగా శాఖలవారీగా జోషి సమీక్షించారు. బడ్జెట్ ప్రతిపాదనలలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలను ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కే. రామకృష్ణారావు ఈ సందర్భంగా వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్ తివారీ, చిత్రారామంచంద్రన్, అధర్‌సిన్హా, సోమేష్‌కుమార్, శాంతికుమారీ, ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, సునీల్ శర్మ, జయేష్ రంజన్, పార్థసారథి, వికాస్‌రాజ్, సబ్యసాచి ఘోష్, కార్యదర్శులు, కమిషనర్లు పాల్గొన్నారు.
చిత్రం...సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న సీఎస్ జోషి