ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో వరదలొస్తే విదేశాల్లో సీఎం విలాస పర్యటనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ ఆగస్టు 18: రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోమారు చంద్రబాబు ఉంటే పరిస్థితి బాగుండేదని ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థవౌతోందని, వరదలొచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం జగన్ విదేశాల్లో ఉల్లాసంగా తిరుగుతున్నారని శాసన మండలిలో టీడీపీ విప్ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. నగరంలోని ఓ హోటల్‌లో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. జగన్ పాదయాత్ర విజయవంతం చేయడంలో బాబు పాత్ర ఉందని, జగన్‌కు హాని జరగకుండా భద్రత కల్పించారని ఆయనన్నారు. మరి చంద్రబాబు విషయంలో ఎందుకు అనుచితంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇప్పుడు చంద్రబాబుకు హాని తలపెట్టేలా ఆయన ఇంటిని డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీస్తున్నారని, మిగతా ప్రాంతాల్లో ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చెబుతున్నారని, ఇదంతా చంద్రబాబుకు హాని తలపెట్టే కుట్ర అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు గెలిచినా, ఓడినా ప్రజలు గుండెల్లో ఉంటారన్నారు. వరదను అడ్డుపెట్టుకుని మంత్రులు బాబు ఇంటికి వెళ్లడం వెనుక కుట్ర జరుగుతోందన్నారు. చంద్రబాబు ఇంటిని అనుమతి లేకుండా ఫొటోలు తీయడానికి ఆయనేమైనా ఉగ్రవాదా? ఉన్మాదా? అని వెంకన్న ఆగ్రహంగా ప్రశ్నించారు. విలేఖరుల సమావేశంలో టీడీపీ అర్బన్ ప్రధాన కార్యదర్శి కొమ్మారెడ్డి పట్ట్భారామ్ పాల్గొన్నారు.