తెలంగాణ

దేవాదుల నీటిని వృథా చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: దేవాదుల నుంచి వచ్చే సాగునీటిని వృథా చేయవద్దని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రైతులకు సూచించారు. దేవాదుల ఎత్తిపోతుల పథకం నుంచి రిజర్వాయర్లకు అక్కడ నుంచి చెరువులకు పొలాలకు విడుదల అవుతున్న సాగనీటిని పకడ్బందీగా వినియోగించుకోవాలని ఆయన రైతులకు పిలుపు ఇచ్చారు. సోమవారం హైదరాబాద్ సచివాయలంలో దేవాదుల నీటి వినియోగంపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతుల పథకం నీటి విడుదల అంశంపై చర్చించారు. జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సమోతరెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి, దేవాదుల సీఈ బంగారయ్య, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, వరంగల్ జనగామకు చెందిన వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.