తెలంగాణ

ఫెలోషిప్‌ల కోసం అర్ధనగ్న ప్రదర్శనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: యూజీసీ ఫెలోషిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్ట్సు కాలేజీ ఆవరణలో అర్ధనగ్న ప్రదర్శన ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా యూజీసీ ఫెలోషిప్‌లు విడుదల చేయకపోవడం దారుణమని అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం యూజీసె ఫెలోషిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఫెలోషిప్‌ను వెంటనే విడుదల చేయాలని గత మూడేళ్లలో కోల్పోయిన 6వేల స్లాట్‌లను విడుదల చేయాలని అన్నారు. ఓబీసీ ఫెలోషిప్‌లను ఈ విద్యాసంవత్సరం నుండే వెయ్యి స్లాట్‌ల నుండి 3వేల స్లాట్‌లకు పెంచి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని అన్నారు. 2018-19 సంవత్సరానికి సంబంధించి వెయ్యి స్లాట్‌లలో చాలా మంది రీసెర్చి స్కాలర్స్ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరారని, యూజీసీ-జేఆర్‌ఎఫ్ సాధించిన వారు, ఇతర స్కాలర్‌షిప్‌లను పొందిన వారు ఈ ఫెలోషిప్‌ను తీసుకోరని, కనుక వెంటనే రెండో జాబితాను విడుదల చేయాలని కోరారు. ఎస్టీ ఫెలోషిప్‌ను 2019-20 అకాడమిక్ ఇయర్‌కు 750 నుండి 1500 వరకూ పెంచాలని, నాన్ నెట్ ఫెలోషిప్ , బీఎస్‌ఆర్ ఫెలోషిప్స్‌ను పునరుద్ధరణ చేయాలని, పీహెచ్‌డీ కోసం అభ్యర్థుల పోటీకి ఏ విధంగా అయితే ఇంటర్వ్యూలను నిర్వహించి పీజీ మార్కులు, ఆర్టికల్స్, నెట్, సెట్ అర్హత ప్రాధాన్యతలు పెడతారో అదే విధంగా యూజీసీ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఫెలోషిప్‌లకు సైతం మార్కులు కేటాయించి ఎంపిక చేయాలని అన్నారు. కేవలం పీజీ మార్కులు మాత్రమే చూసి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఫెలోషిప్‌లను ఇవ్వడం అర్ధరహితమని అన్నారు.