తెలంగాణ

ప్రగతి భవన్ ముట్ట‘్ఢ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: దీర్ఘకాలంగా విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ నేతృత్వంలో విద్యార్థులు ప్రగతి భవన్‌ను ముట్టడించిన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా విద్యార్థి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించమని కోరితే విద్యార్థులను అరెస్టు చేస్తారా అంటూ అరెస్టుల తీరుపై మంగళవారం నాడు రాష్టవ్య్రాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎల్ మూర్తి, కార్యదర్శి తాళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు తాటికొండ రవి పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ముట్టడి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరీంనగర్, వరంగల్కామారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లోని సమస్యలను పరిష్కరించాలని శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను రౌడీల్లా ఈడ్చుకుంటూ అక్రమంగా అరెస్టులు చేయడాన్ని రాష్ట్ర కమిటీ తీవ్రంగా నిరసించింది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, గురుకులాలు, యూనివర్శిటీల్లో కనీస వౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే చర్యలకు పాల్పడుతోందని వారు ఆరోపించారు.
ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనాన్ని తెలంగాణ వచ్చిన రెండేళ్లకే ప్రారంభిస్తామని గొప్పలు చేసి రెండోసారి అధికారంలోకి వచ్చినా కూడా దాని ఊసెత్తడం లేదన్నారు. రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 8442 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 24,261 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రాష్ట్రంలో 23వేల కోట్ల రూపాయిల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉన్నాయని, కొత్తగా ఏర్పాటు చేసిన గురుకులాలకు ఇంత వరకూ సొంత భవనాలు నిర్మించలేదని, ఇంకా ఎన్నో రకాలు సమస్యలు విద్యారంగంలో ఉన్నాయని వాటి పరిష్కారానికి ఆందోళన చేస్తుంటే అరెస్టులు చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని ఈ అరెస్టులను మేథావులు, ప్రజాస్వామిక వాదులు, విద్యార్థులు ఖండించాలని అన్నారు. అంతకుముందు తాటికొండ రవి మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. కొత్త గురుకులాలను ఏర్పాటు చేశామని డప్పుకొట్టుకుంటున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క గురుకులానికీ సొంత భవనాలను నిర్మించలేదని, మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన గురుకులాల్లో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు.