తెలంగాణ

ఆర్థికవేత్త చెన్నమనేనిని కలిసిన వినోద్‌కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ చెన్నమనేని హనుమంతరావుతో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇద్దరు మధ్య గంటపాటు చర్చలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళికలను లక్ష్యంగా అమలు చేయాల్సి ఉంటుందని ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. నూతనంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా నియమితులైన బోయినిపల్లి వినోద్‌కుమార్‌కు అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. సోమవారం చెవేళ్ళ పార్లమెంట్ సభ్యులు రంజీత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ (జగిత్యాల) బిగాల గణేష్ గుప్తా (నిజామాబాద్ అర్బన్) నాగర్‌కర్నూల్ మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పురాణం సతీష్, శ్రీనివాస్‌రెడ్డి, కర్నే ప్రభాకర్, మాజీ పార్లమెంట్ సభ్యులు మందా జగన్నాథం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జగిత్యాల జడ్పీ చైర్మన్ దావ వసంత, వరంగల్ మేయర్ కొండా ప్రకాష్, పార్టీ నేతలు ఉన్నారు.