తెలంగాణ

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని బీసీ హక్కుల సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. జనానా ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం ఐక్య ఉద్యమాలు చేపట్టాలని అఖిలపక్ష నేతలు మంగళవారం నాడు పిలుపునిచ్చారు. బీసీ హక్కుల సాధన సమితి ప్రధాన కార్యదర్శి రాయబండి పాండురంగాచారి అద్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు, ఐప్సో జాతీయ కార్యదర్శి డాక్టర్ డీ సుధాకర్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీ రాయప్ప, లోక్‌సత్తా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్రాచారి తదితరులు ప్రసంగించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 33 శాతం నుండి 22 శాతాని తగ్గించడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు 33 శాతం నుండి 56 శాతానికి పెంచాలని ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేపట్టడం ద్వారా బీసీ రిజర్వేషన్ల అంశానికి శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ సామాజిక ఆర్ధిక వెనుకబాటు ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని , బీసీల అంశంపై కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందని ప్రశ్నించారు. వీ హనుమంతరావు మాట్లాడుతూ 54 శాతం మేర బీసీలు ఉన్నారని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 22.9 శాతానికి తగ్గించడం దారుణమని పేర్కొన్నారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీలను రాజకీయంగా అణగదొక్కడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సత్తా నేత మున్నారపు నాగరాజు, జస్టిస్ పార్టీ నుండి బి వెంకటేష్‌గౌడ్, ప్రొఫెసర్ ఎంఎం చారి తదితరులు పాల్గొన్నారు.