తెలంగాణ

అవాస్తవాల పుట్ట.. టీఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 20: బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తనకు తెలియదని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని బీజేపీ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ మేరకు ఆయన కేటీఆర్‌కు లేఖ రాశారు. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి 13 కోట్ల సభ్యత్వం ఉన్న అతి పెద్ద రాజకీయ పార్టీకి బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఎదిగిన గొప్ప నేత నడ్డా అన్నారు. కార్పోరేట్ సంస్థల పెంపుడు నాయకుడు కాదని ఆయన అన్నారు. హైదరాబాద్‌కు విచ్చేసినప్పుడు సైతం హంగు ఆర్భాటాలకు పోకుండా పార్టీ కార్యాలయంలోనే సామాన్య కార్యకర్తగా నివాసం ఉన్న నేత నడ్డా అన్నారు.3 సార్లు ఎమ్మెల్యేగా, రాష్టమ్రంత్రిగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రజాసేవలో ఉన్న నేతన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద ఆసుపత్రులకు నిధులను చెల్లించలేకపోవడంతో పేదలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి మాత్రం రూ.630 కోట్లు మాత్రమే అని పేర్కొంటున్నారన్నారు. ప్రజల ఆరోగ్య సమస్యలను సీఎం గాలికి వదిలేశారన్నారు. కేంద్రం ఆయుష్మాన్ భారత్‌ను చక్కగా అమలు చేస్తోందన్నారు. కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పెంచారన్నారు. ఇందులో పారదర్శకత లేదన్నారు. గొర్రెల పెంపకం దార్లు రూ.3వేల కోట్ల పథకంతో అవినీతి కోకొల్లలన్నారు. హైదరాబాద్‌ను డల్లాస్‌గా మారుస్తామని ఉత్తర ప్రగల్బాలు పలికి మురికి కూపంగా మార్చారన్నారు. నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కేవలం 28వేల ఉద్యోగాలు మాత్రం ఇచ్చారన్నారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించి, ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలను నట్టేట ముంచి అబద్ధాలకు మారుపేరుగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో మోదీ ప్రభంజనం వీస్తుంటే, మంత్రులు అసహనానికి గురై బీజేపీపై నిందలు మోపడం తగదన్నారు.