తెలంగాణ

27న చలో బస్ భవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: ఆర్టీసీలో ఉద్యోగ, కార్మికులకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్న డిమాండ్ నానాటికి పెరిగిపోతున్నది. ఈనెల 27న చలో బస్సుభవన్ కార్యక్రమంలో భాగంగా ఎంప్లారుూస్ యూనియన్ నేతలు బుధవారం వాల్‌పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు బాబు, రాజిరెడ్డి మాట్లాడుతూ ఈనెల 27 తలపెట్టిన చలో బస్సు భవన్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు తరలిరావాలని వారు పిలుపు ఇచ్చారు. ఉద్యోగ, కార్మికుల సమస్యలపై ఆర్టీసీ యాజమాన్యానికి వినతిపత్రాలు ఇచ్చినా స్పందించలేదన్నారు. సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేయడంతో సమస్యలు మరింత జటిలం అవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ విన్నపాలను పట్టించుకోలేదని, అందకు తాము చలో బస్సుభవన్ కార్యక్రమాన్ని చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంతో పాటు వేతన సవరణ అమలు, కండక్టర్లు, డ్రైవర్లలకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కండక్టర్ల, డ్రైవర్లపై యాజమాన్యం వేధింపులు పెరిగిపోయాయని, దీంతో వారు అభద్రతకు గురౌతున్నారని, చివరికి ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారని వారు భయాందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షుడు సీహెచ్ నర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి గోపాల్, సహాయ కార్యదర్శి జక్కరయ్య, హైదరాబాద్ సిటీ జోనల్ ప్రెసిడెంట్ మురళీధర్, మల్లేష్, చార్మినార్ డివిజనల్ అధ్యక్షుడు ఎఎస్‌రెడ్డి పాల్గొన్నారు.
చిత్రం...వాల్‌పోస్టర్లను విడుదల చేస్తున్న ఈయూ నేతలు