తెలంగాణ

తొమ్మిది చోట్ల నగర జీవనోపాధి కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది మున్సిపాలిటీల్లో దారిద్య్ర నిర్మూలన పథకం కింద నగర జీవనోపాధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో చేతి వృత్తులపై ఆధారపడి జీవించే వారు తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం ఉంటుంది. తక్కువ ధరకు వస్తువులను కొనుగోలు చేసేవారికి, నైపుణ్యంతో వస్తువులను తయారుచేసే వారికి మధ్య అనుసంధానం కోసం నగర జీవనోపాధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ప్రాంతాల్లో దారిద్య్ర నిర్మూలన మిషన్ కింద నిర్ణయించారు. పట్టణ పేదలను ఆర్థికంగా బలపడేందుకు ఈ మిషన్ కృషి చేస్తుంది. ఈ కేంద్రాల ఏర్పాటుకు కేంద్రానికి చెందిన అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లిలీ హుడ్ మిషన్ కింద నిధులను మంజూరు చేస్తారు. రాష్ట్రంలో కరీంనగర్, మిర్యాలగూడ, సూర్యాపేట, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, కొత్తగూడెం, పాల్వంచ, సిద్ధిపేట, నల్లగొండ మున్సిపాలిటీల్లో నగర జీవన కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ జీవన కేంద్రాల్లో వడ్రంగి, సెక్యూరిటీ, తోటల పెంపకం, నిర్మాణం, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్, హెల్త్ కేర్ సపోర్ట్, వివిధ పరికరాల మర్మమత్తులు,శిశువుల సంరక్షణ, మోటార్ మెకానిక్, బ్యూటీ పార్లర్, హ్యాండీ క్రాఫ్ట్స్, హౌస్ కీపింగ్ తదితర విభాగాల్లో శిక్షణ పొందిన వారి సేవలు లభ్యమవుతాయి. ఇక్కడ స్వయం ఉపాధి కింద నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తారు. నగరాల్లో ప్రజలు ఈ కేంద్రాలకు వెళ్లి తమకు అవసరమైన వస్తువుల తయారీ, మరమ్మత్తుకు సంబంధించి ఆర్డర్ కూడా ఇవ్వవచ్చును. ఈ కేంద్రాలను మాల్స్,రిటైల్ అవుట్‌లెట్స్, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లతో అనుసంథానం చేస్తారు. ఇందులో సిరిసిల్ల, కామారెడ్డి, కొత్తగూడెం, సిద్ధిపేట కేంద్రాలకు రూ.3లక్షల చొప్పున, పాల్వంచ, నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కరీంనగర్ కేంద్రాలకు రూ.4లక్షల చొప్పున నిధులు వస్తాయి. వికారాబాద్, వనపర్తి, నాగర్‌కర్నూల్, కోదాడ, బోడుప్పల్‌లో ఈ తరహా కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.