తెలంగాణ

అగ్రికల్చర్ స్ట్రీం అడ్మిషన్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: తెలంగాణలో అగ్రికల్చర్ స్ట్రీం రెండో దశ అడ్మిషన్లలో భాగంగా సీట్లను కేటాయించినట్టు కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. బీ ఫార్మసీ, ఫార్మాడీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో 120 సంస్థల్లోనూ 7793 సీట్లకు 7591 సీట్లను కేటాయించామని, ఇంకా 202 సీట్లు మిగిలిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఎమ్సెట్ అగ్రికల్చర్ స్ట్రీంలో 61,166 మంది అర్హత సాధించగా, సర్ట్ఫికేట్ల పరిశీలనకు 11506 మంది హాజరయ్యారు. తుది దశలో వెబ్ ఆప్షన్లను 6124 మంది ఇచ్చారు. రెండోదశ కౌనె్సలింగ్ సమయానికి 7793 సీట్లు అందుబాటులో ఉండగా వాటిలో 7591 సీట్లను భర్తీ చేశామని చెప్పారు. బీ ఫార్మసీలో మూడు ప్రభుత్వ కాలేజీల్లో 156 సీట్లు, 116 ప్రైవేటు కాలేజీల్లో 6321 సీట్లు భర్తీ చేశామని, 54 ఫార్మా డీ ప్రైవేటు కాలేజీల్లో 1093 సీట్లు, ఒక ప్రైవేటు బయోటెక్నాలజీ కాలేజీలో 21 సీట్లను భర్తీ చేశామని ఆయన వివరించారు. సీట్లు పొందిన వారు ఈ నెల 26వ తేదీలోగా ఫీజులు చెల్లించి వెంటనే సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలని చెప్పారు.