తెలంగాణ

అక్టోబర్‌లో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : వచ్చే అక్టోబర్ నెలలో హుజూర్‌నగర్ అసెంబ్లీ సీటు కు ఉప ఎన్నిక జరగనుండడంతో, ఆ సీటును కైవశం చేసుకునేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. హుజూర్‌నగర్ అసెం బ్లీ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికైన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. దీంతో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో
గెలిచి హుజూర్‌నగర్‌లో పాగావేయాలని టీఆర్‌ఎస్ ఉవీళ్లూరుతోంది. తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ సీటును గెలుచుకుని, టీఆర్‌ఎస్‌కు తమ పార్టీ ప్రత్యామ్నాయమని చెప్పేందుకు బీజేపీ ఉబలాటపడుతోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా ఒక ఉప ఎన్నిక జరగబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించిన టీఆర్‌ఎస్, అనేక కారణాల వల్ల లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించిలేకపోయింది. పైగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సిటింగ్ సీటు కావడంతో ఇక్కడ కూడా పాగా వేసి తమ బలాన్ని చూపించాలని టీఆర్‌ఎస్ తాపత్రయపడుతోంది. గత ఎనిమిది నెలల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వమంటే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, తమ ఆగ్రహాన్ని ఈ ఎన్నికల ద్వారా చూపిస్తారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు గంపెడాశలతో ఉన్నారు. ఈ ఉప ఎన్నిక వల్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేకపోయినా, ఇక్కడ గెలిచి తమ సత్తా చాటడం వల్ల మానసికంగా తమ ఆధిపత్యాన్ని చాటవచ్చని బీజేపీ నేతలంటున్నారు. హుజూర్‌నగర్‌లో వాస్తవానికి కాంగ్రెస్‌కు మంచి పట్టుంది. 2009 ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఉత్తమ్‌కుమార్ రెడ్డి 29వేల ఓట్లతో గెలిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి 24వేల ఓట్లతో, 2018 ఎన్నికల్లో 7వేల మెజారిటీతో నెగ్గారు.