తెలంగాణ

జియో ట్యాగింగ్‌పై వైద్యుల ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఆయుష్ విభాగంలో జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం నిర్ణయంపై వైద్యులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలంగాణ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ లాలుప్రసాద్ రాథోడ్ వెల్లడించారు. గురువారం నిలోఫర్ ఆసుపత్రిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జియో ట్యాగింగ్‌పై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని అన్నారు. ఆయుష్ విభాగంలో డాక్టర్లకు జియో ట్యాగింగ్ వేస్తామని అధికారులు చెప్పడాన్ని ఆయన నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్లు జంతువులు కాదని, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగితే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. జియో ట్యాగింగ్ విధానాన్ని వైద్య సమాజం మక్తకంఠంతో ఖండిస్తోందని ఆయన చెప్పారు. అలాగే జియో
ట్యాగింగ్ విధానం రాజ్యాంగంలోని 21వ ఆధికరణకు విరుద్ధమని ఆయన తెలిపారు. ఆయుష్ వైద్యులకు రాష్ట్ర డాక్టర్ల సంఘం పూర్తి మద్దతు పలుకుతోందన్నారు. కొంత మంది ఉన్నధికారులు అత్యుత్సాహంతో ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. అధికారుల అనాలోచిత విధానంతో వైద్యులను గందరగోళంలోకి నెట్టవద్దని ఆయన సూచించారు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా డాక్టర్లకు జియో ట్యాగింగ్ అమలు చేసేన దాఖలాలు లేవన్నారు. పేదలకు సేవలందించే డాక్టర్లకు జియో ట్యాగింగ్ వాడటం రాజ్యాంగ ఉల్లఘన అవుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం తక్షణ స్పందించి దాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలని లాలుప్రసాద్ రాథోడ్ డిమాండ్ చేశారు.