తెలంగాణ

పెద్దపల్లి కలెక్టర్‌కు అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, ఆగస్టు 22: ఈనెల 25 నుండి 30 వరకు స్వీడన్ దేశంలోని స్టాక్‌హోమ్, టెలి 2 ఎరీనాలో నిర్వహించే ప్రపంచ నీటి వారోత్సవాలలో పాల్గొనే అరుదైన గౌరవం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనకు లభించింది. మనదేశం నుంచి కేంద్ర ప్రభుత్వ తాగునీటి, పారిశుద్ధ్య శాఖ సంచాలకుడు యుగల్ కిశోర్, జార్ఖండ్ పంచాయతీరాజ్ శాఖ సెక్రటరీ ఆరాధన పట్నాయక్, జమ్మూ కాశ్మీర్ కలెక్టర్ ఇందు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ప్రపంచ నీటి వారోత్సవాలలో పాల్గొనే బృందంలో పాల్గొననున్నారు. స్వచ్ఛసర్వేక్షన్ అమలులో జాతీయస్థాయలో ప్రతిభ చూపినందుకు ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న జిల్లాకలెక్టర్ శ్రీదేవసేన రాష్ట్ర ప్రభుత్వం నీటికి ఇస్తున్న ప్రాధాన్యత గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి సదస్సులో వివరించనున్నారు. స్వీడన్‌లోని ప్రపంచ నీటి సదస్సులో పాల్గొనే అరుదైన అవకాశం జిల్లాలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయుల భాగస్వామ్యంతో ఈ గౌరవం లభించిందని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం, ప్రభుత్వ సిబ్బంది జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనకు శుభాకాంక్షలు తెలిపారు.