తెలంగాణ

ఉద్యోగులకు జియో ట్యాగింగ్ సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: వైద్య ఆరోగ్య శాఖలోని ఆయుష్ విభాగంలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి జియోట్యాగింగ్ విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించడం సరికాదని , ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు కే యాదా నాయక్, ప్రధానకార్యదర్శి కే బలరాం పేర్కొన్నారు. ఉద్యోగులకు నష్టం చేసే ఈ నిర్ణయం ఎంత మాత్రం సరికాదని అన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఉద్యోగులకు లేని విధానాలను తెలంగాణలో అమలుచేయాలని చూడటం సరికాదని అన్నారు. ఉద్యోగుల మొబైల్ ఫోన్లలో జియోట్యాగింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని, ఇన్‌స్టాలేషన్ చేసుకోని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని, ఇది ఉద్యోగుల వ్యక్తిగత స్వేచ్చను హరించడమేనని అన్నారు.
వైద్య ఆరోగ్య రంగంలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న డాక్టర్లు, పారామెడికల్ , నర్సింగ్ సిబ్బందిపై తీవ్రమైన పనిభారం పెరిగిందని దాంతో మానసికంగా, ఆరోగ్యపరంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారుని ఈ సమయంలో ఇలాంటి నిర్ణయాలు ఎంత మాత్రం సరికాదని అన్నారు.