తెలంగాణ

గణేష్ మండపాలకు విద్యుత్ కనెక్షన్లు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: రానున్న వినాయక పండుగ సందర్భంగా గణేష్ మండపాలకు తప్పనిసరిగా విద్యుత్ కనెక్షన్లు సంబంధిత నిర్వాహకులు విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలని టీఎస్ ఎస్‌పీడీసీఎల్ సూచించింది. ఎలాంటి అనుమతులు లేకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని, అక్రమ కనెక్షన్లను పొందిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. గణేష్ మండపాలకు విద్యుత్ కనెక్షన్ల కోసం ఎస్‌పీడీసీఎల్ టారిఫ్‌ను ప్రకటించింది. జంటనగరాల విద్యుత్ జోనల్ అధికారులకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 11 రోజుల పాటు నిర్వహించనున్న వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గణేష్ మండపాల్లో ఎల్‌టీ కనెక్షన్ తాత్కాలికంగా సంబంధిత నిర్వాహకులు చార్జీలను చెల్లించాలని సూచిస్తున్నారు. 1250 వాట్ల విద్యుత్ వినియోగానికి రూ. 500, 2250 వాట్ల విద్యుత్‌కు రూ. 1000, 3500 వాట్ల విద్యుత్‌కు రూ. 1500, 3500 వాట్ల పైబడి విద్యుత్ వినియోగిస్తే అదనంగా రూ. 750 చెల్లించాలని అధికారులు తెలిపారు. తాత్కాలికంగా విద్యుత్ కనెక్షన్ కాకుండా మీటర్ విద్యుత్ సరఫరా కోసం ప్రతి యూనిట్ కోసం రూ. 11 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. గణేష్ మండపాల కోసం విద్యుత్‌ను వినియోగించడానికి విద్యుత్ తీగలకు కొండీలు తగిలించి విద్యుత్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీఎస్ ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి హెచ్చరించారు. అధికారికంగా కనెక్షన్ పొంది ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు వైభవంగా జరుపుకోవాలని సీఎండీ సూచించారు.