తెలంగాణ

93 లక్షల ఎకరాల్లో పంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: తెలంగాణలో పంటల విస్తీర్ణం క్రమంగా పెరుగుతూ 93 లక్షల ఎకరాలకు చేరింది. వానాకాలం ప్రారంభమైన జూన్ మూడోవారం వరకు వానలు కురవకపోవడంతో మొదట్లో అందరిలో ఆందోళన కలిగింది. ఆ తర్వాత వానలు కురవడం ప్రారంభమైన తర్వాత విత్తనాలు వేయడం వేగంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం 93 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. వ్యవసాయ శాఖ వారం వారం విడుదల చేసే నివేదికలో ఈ వివరాలు పొందుపరిచారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ పంటల పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. కామారెడ్డి, రాజన్న సిర్సిల్లా, నిర్మల్, ఆసిఫాబాద్ (కొమురంబీం) జిల్లాల్లో సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణంలోనే పంటలసాగు జరిగింది. ఆగస్టు మొదటి వారం వరకు వరివిస్తీర్ణం 6 లక్షల ఎకరాలకు మించలేదు. ఇప్పుడు దాదాపు 20 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. తైదలు (రాగులు), జొన్న, మొక్కజొన్న, కందులు, ఉలవలు, మినుములు దాదాపు పూర్తిస్థాయి విస్తీర్ణంలో వేశారు. పత్తిపంట సాధారం కంటే ఎక్కువ విస్తీర్ణంలోనే సాగయింది. పత్తి సాధారణంగా 43 లక్షల ఎకరాలు సాగవుతుండగా, ఈ సీజన్‌లో 44 లక్షల ఎకరాల్లో వేశారు. పొగాకు, మిరప పంటల విస్తీర్ణం మాత్రం బాగా తగ్గింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం లేవు. సంగారెడ్డి, యాదాద్రి, మేడ్చెల్, వికారాబాద్, హైదరాబాద్, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ప్రస్తుత వానాకాలంలో ఇప్పటి వరకు 528 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావలసి ఉండగా, 491 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు (ఏఓ), వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ) తమకు కేటాయించిన గ్రామాల్లోనే ఉంటూ రైతులకు అందుబాటులో ఉన్నారు. ప్రభుత్వం పక్షాన అవసరమైన విత్తనాలను అందించారు. ప్రస్తుతం ఎరువుల అవసరం ఉండటంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (ప్యాక్స్)తో పాటు ప్రైవేట్ వ్యాపారుల సాయంతో రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ చర్యలు తీసుకున్నది. వ్యవసాయ శాఖాధికారులు రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడంలో నిమగ్నమై ఉన్నారు. ఎప్పటికప్పుడు పంటల విస్తీర్ణం వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపిస్తున్నారు.