తెలంగాణ

రక్షణ రంగం కార్మికుల హక్కులు రక్షించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: రక్షణ రంగంలోని 41 ఉత్పత్తి సంస్థల్లో పని చేస్తున్న లక్ష మందికి పైగా కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఎఐటీయూసీ భారీ ర్యాలీని నిర్వహించింది. ఈ నెల 20 నుండి 30 రోజుల పాటు నిరవధిక సమ్మె ప్రకటించి లక్షలాది మంది కార్మికులు తమ హక్కులు రక్షించమని కోరుతున్నారని ప్రభుత్వం మొండివైఖరి ఎంత మాత్రం తగదని ఎఐటీయూసీ ప్రధానకార్యదర్శి వీఎస్ బోస్ పేర్కొన్నారు. అతి ప్రాధాన్యత ఉన్న రక్షణ రంగంలోని సమ్మె ప్రారంభమై మూడు రోజులు గడిచిపోయినా కేంద్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా మొండి వైఖరిని ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. రక్షణ రంగంలోని కార్మికుల డిమాండ్‌లు పరిష్కారం అయ్యేవరకూ ఎఐటీయూసీ వారి పోరాటానికి అండగా ఉంటుందని అన్నారు. వెంటనే యూనియన్లతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. ర్యాలీలో రాష్ట్ర నేతలు పీ ప్రేం పావని, ఎన్ కరుణకుమారి, సీతామహాలక్ష్మీ, కమల, సత్యనారాయణ, ఆర్ మల్లేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కార్మికులు చేస్తున్న అఖిల భారత సమ్మెలో భాగంగా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కార్మికులు సమ్మె చేస్తున్నారని రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే గంగాధరరావు అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఆయన తప్పుపట్టారు.