తెలంగాణ

తూర్పు, మధ్య తెలంగాణలో భారీ వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: తెలంగాణలోని తూర్పు, మధ్య ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో చాలా చోట్ల భారీ వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ (పట్టణ), వరంగల్ (గ్రామీణ), కరీంనగర్, మంచిర్యాల, కొమురంబీం, జగిత్యాల, జనగామ, పెద్దపల్లి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. తెలంగాణలో నైరుతీ రుతుపవనాలు సాధారణంగా ఉన్నాయని వివరించారు. గత 24 గంటల్లో వికారాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వనపర్తి, నల్లగొండ, కొత్తగూడెం, జగిత్యాల తదితర జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి.