తెలంగాణ

మొదలైన సీపీజెట్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో సంప్రదాయ పీజీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహిస్తున్న సీపీజెట్ కౌనె్సలింగ్‌కు ఇంత వరకూ 27,500 మంది అభ్యర్ధులు సర్ట్ఫికెట్ల పరిశీలనకు హాజరైనట్టు కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ కిషన్ తెలిపారు. తొలి దశ సర్ట్ఫికెట్ల పరిశీలన 16న ప్రారంభమైందని, 24 వరకూ కొనసాగుతుందని ఆయన గురువారం నాడు చెప్పారు. ఇంత వరకూ 21 సబ్జెక్టుల అడ్మిషన్లకు సంబంధించి సర్ట్ఫికెట్ల పరిశీలన పూర్తి చేశామని, మిగిలిన సబ్జెక్టులను రానున్న రెండు రోజుల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అన్ని వర్శిటీల విద్యార్థులూ హైదరాబాద్ రాకుండా, ఎక్కడికక్కడ వికేంద్రీకరించామని, ప్రతి వర్శిటీ పరిధిలో సర్డ్ఫికెట్ల పరిశీలన జరుగుతోందని అన్నారు. 21 సబ్జెక్టులకు 39వేల మంది రిజిస్టర్ చేసుకోగా ఇంత వరకూ 27,580 మంది సర్ట్ఫికెట్ల పరిశీలన పూర్తయిందని చెప్పారు. వివిధ కారణాల వల్ల ఎవరైనా సర్ట్ఫికెట్ల పరిశీలనకు హాజరుకాలేకపోయి ఉంటే వారు 24వ తేదీలోగా హాజరుకావచ్చని సూచించారు. 27వ తేదీన తమ వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్‌కు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అన్ని సబ్జెక్టులూ కలిపి సీపీజెట్‌కు 90,354 మంది రిజిస్టర్ చేసుకోగా, 74815 మంది అర్హత సాధించారు. కాగా, తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు (టీఎస్‌సెట్) ఫలితాలను 23వ తేదీ సాయంత్రం 3.30 గంటలకు విడుదల చేయనున్నారు. మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ బిరుదురాజు యాదవరాజు, కోఆర్డినేటర్ డాక్టర్ ఎం శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.