తెలంగాణ

1న పెన్షన్ విద్రోహ దినం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహదినం పాటించాలని, జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ - యుఎస్‌పీసీ నిర్ణయించింది. కమిటీ స్టీరింగ్ కమిటీ సమావేశం గురువారం నాడు టీఎస్‌యూటీఎఫ్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ రాములు అధ్యక్షతన జరిగింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని, రాష్టవ్య్రాప్తంగా లక్షా 49వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల సామాజిక భద్రతకు శాపంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. 2018 మే 16న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలుచేయాలని, గత ఏడాది జూన్ 2 నుండి మధ్యంతర భృతిని, 2018 జూలై 1 నుండి నూతన పీఆర్సీని అమలుచేయాలని, అప్ గ్రేడ్ చేసిన పండిట్, పీఈటీ పోస్టులతో సహా ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ , హెడ్మాస్టర్, ఎంఈఓ, పదోన్నతుల కల్పనకు షెడ్యూలు ప్రకటించాలని అంతర్‌జిల్లా బదిలీలు నిర్వహించాలని, మోడల్ స్కూల్ సర్వీసు రూల్స్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని యుఎస్‌పీసీ నేతలు కోరారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాలు సాధన కోసం అన్ని సంఘాలూ కలిసి విశాల ఐక్యవేదికగా ఏర్పడి ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని, యుఎస్‌పీసీ స్టీరింగ్ కమిటీ అన్ని సంఘాలకు విజ్ఞప్తి చేసింది. పూర్వాశ్రమంలో ఉద్యోగ సంఘాలకు నాయకుడిగా ఉన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఉద్యోగ సంఘాలను బెదిరించడం సబబుకాదని , సమస్యల పరిష్కారానికి చాతనైతే ముఖ్యమంత్రిని ఒప్పించాలని హితవు పలికారు. ఈ సమావేశంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు చావ రవి, వై అశోక్‌కుమార్, ఎం రఘుశంకర్‌రెడ్డి, టీ లింగారెడ్డి, ఎన్ చెన్నరాములు, కే భిక్షపతి, కొమ్ము రమేష్, శాగ కైలాసం పాల్గొన్నారు.

చిత్రం...టీఎస్‌యూటీఎఫ్ కార్యాలయంలో గురువారం స్టీరింగ్ కమిటీ సమావేశం