తెలంగాణ

మట్టి వినాయకులనే పూజిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా మట్టి వినాయకులనే పూజించాలని రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో వినాయక చవితి సందర్భంగా పూజలకోసం ఉపయోగించేందుకు మట్టి వినాయక ప్రతిమలను గురువారం అందించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేకంగా 1,60,000 మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయించింది. ఆలయాల్లో పూజల కోసం పెద్దసైజు మట్టి ప్రతిమలను తయారు చేశారు. 50 పెద్ద విగ్రహాలను ఈ సందర్భంగా మంత్రి ఆలయాల ప్రతినిధులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రాష్ట్రంలోని జల వనవనరులు కాలుష్యం కాకుండా కాపాడుకోవాల్సి ఉందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలను ఉపయోగించవద్దని కోరారు. రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను జలాశయాల్లో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు కలుషితం అవుతుందని గుర్తు చేశారు. రసాయనాలు దేవతలకు కూడా ప్రీతిపాత్రం కాదన్నారు. మట్టి వినాయక విగ్రహాలనే వాడదామంటూ ప్రజలకు పిలుపు ఇచ్చేలా, ప్రజల్లో చైతన్యం కలిగించేలా కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన పోస్టర్లను, కరపత్రాలను ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో దేవాదాయ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్, టీఎస్‌పీసీబీ అధికారులు నగేష్, రమేష్ గుప్తా, మురళీమోహన్, దేవాదాయ శాఖ అధికారులు, ఈఓలు పాల్గొన్నారు.
చిత్రం...పోస్టర్‌ను విడుదల చేస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి