తెలంగాణ

నడ్డా రాకతో పెరిగిన జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: తెలంగాణలోని 33 జిల్లాల్లో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసే దిశగా బీజేపీ చురుకుగాపావులు కదుపుతోంది. వచ్చే నెల 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా చేత జాతీయ జెండాను ఎగురవేయనున్నట్లు బీజేపీ రాష్టశ్రాఖ ప్రకటించింది. మరోవైపు ఇతర పార్టీలనుంచి పెద్ద ఎత్తున నేతలను చేర్చుకుంటోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా విమర్శల జోరును పెంచింది. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు రోజుల పర్యటన పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచింది. జేడీ నడ్డా రాష్ట్ర పర్యటన సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ సేవలు స్తంభించాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు నిధుల చెల్లింపులో ప్రతిష్టంభన ఏర్పడింది. అనంతరం రాష్ట్రప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించి కొంత మేర నిధులను విడుదల చేసింది. దీంతో ఆరోగ్య శ్రీ సేవలను పునరుద్ధరించారు. ఈ అంశాన్ని జేపీ నడ్డా ఉపయోగించుకున్నారు. నడ్డా చేసిన విమర్శలకు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. దీంతో బీజేపీ నేతలు మూకుమ్మడిగా కేటీఆర్ వ్యవహారశైలి, నడ్డా అంటే ఎవరో తెలియదని మాట్లాడడంపై విరుచుకుపడ్డారు. దీంతోరానున్న రోజుల్లో బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య ప్రకటనలు, విమర్శల యుద్ధం తీవ్రమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. రాష్ట్రంలో అనేక కారణాల వల్ల కాంగ్రెస్ శిబిరంలో నిరుత్సాహం చోటు చేసుకోవడంతో, తామే టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమంటూ బీజేపీ జనంలోకి దూసుకుపోతోంది. జేపీ నడ్డా కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గోల్కొండ కోటపై బీజేపీ జెండాను ఎగరేస్తామని కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ప్రకటనలు చేశారు. ప్రతి జిల్లాలో వంద మంది మేధావులు, తటస్తులను పార్టీలో చేర్చుకునే విషయమై దృష్టినిసారించాలని పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర నేతలకు మార్గనిర్దేశనం చేశారు. జేడీ నడ్డా సమక్షంలో ఇప్పటికే టీడీపీకి చెందిన పెద్ద ఎత్తున నేతలు బీజేపీలో చేరారు. రాజ్యసభ ఎంపీ, టీడీపీ నేత గరికపాటి మోహన్‌రావు బీజేపీలోకి రావడంతో బీజేపీలో జోష్ పెరిగింది. ప్రతి నియోజకవర్గంలో మేధావులు, తటస్తుల ఇండ్లకు వెళ్లి పార్టీ విధానాలను తెలియచేసి వారిని పార్టీలోకి ఆహ్వానించాలని, మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి వర్గాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల ఉన్న అసంతృప్తిని ఉపయోగించుకోవాలని బీజేపీ హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో రిటైర్డయిన ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు, మాజీ ఉపకులపతులు, సీనియర్ న్యాయవాదులు, చార్టెర్డ్ అకౌంటెంట్లు, కళాకారులు, ఐటీ ఉద్యోగులు, ఇతర రంగాల్లో ప్రముఖులను కలుసుకుని పార్టీలో చేరాలని కోరేందుకు బీజేపీ నేతలు వ్యూహాలను ఖరారు చేశారు. మైనారిటీలు కూడా పెద్ద సంఖ్యలో పార్టీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారని, ఇది శుభ పరిణామమని బీజేపీ నేతలు చెప్పారు. గురువారం కూడా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యేలు నందీశ్వర్ గౌడ్, విజయ్‌పాల్ రెడ్డి తదితరులు బీజేపీలో చేరారు. బీజేపీ కార్యాలయానికి ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో గ్రామ,మండల, నియోజకవర్గాల స్థాయి నేతలు తమ అనుచరులతో వచ్చి పార్టీలో చేరుతున్నారు.