తెలంగాణ

రిజర్వు ఫారెస్టు బ్లాకుల్లో అడవులు అభివృద్ధి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, ఆగస్టు 23: వనపర్తిలోని అన్ని రిజర్వు ఫారెస్టు బ్లాక్ పరిధిలో 10 ఎకరాల్లో సెమీ మెకానికల్ పద్ధతిలో అడవులను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ఛీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు ఎకె సిన్హా చెప్పారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఏకో పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా సీసీ ఎఫ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని రిజర్వు ఫారెస్టు బ్లాకులలో 10 ఎకరాలలో సెమి మెకానికల్ పద్ధతిలో అడవులను అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందులో భాగంగా ఇది వరకే అడవులలో ఎండిపోయిన చెట్లను తీసివేసి ఆ ప్రాంతాన్ని చదును చేసి మంచి మొక్కలను నాటాలని సూచించారు. ఇలాంటివి ప్రతి నియోజకవర్గానికి ముఖ్యంగా ప్రతి రిజర్వు ఫారెస్టు బ్లాకు ఒకటి చొప్పున అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏకో పార్కు వనపర్తి పట్టణానికి అతి సమీపంలో ఉండడం, వనపర్తి- కర్నూల్ రహదారి పార్కు చెంతన వెళ్తుండడం వల్ల ప్రస్తుతం ఏకో పార్కును అనుకొని ఉన్న రిజర్వు ఫారెస్టులో సెమి మెకానికల్ పద్దతిలో అడవిని అభివృద్ధి చేస్తే బాగుంటుందని సూచించారు. ప్రస్తుతం ఈ అడవిలో ఎండిపోయిన చెట్లు, యూక లిఫ్టస్ చెట్లు, తుప్పలను తొలగించి రహదారి వెళ్లే వారికి సుంధరంగా కనిపించేలా పొడవాటి మొక్కలను నాటాలని ఆయన సూచించారు.